ఫిరాయింపు ఎంపి కొత్త‌ప‌ల్లి గీత కొత్త రాజ‌కీయ పార్టీ ప్రారంభిస్తున్నారు.  అందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు ఇప్ప‌టికే పూర్త‌య్యాయ‌ని స‌మాచారం. ప‌రిస్ధితులన్నీ అనుకూలిస్తే గురువారం విజ‌య‌వాడ‌లో పార్టీ పేరు, విధి విధానాలు, సిద్దాంతాలు మొద‌లైన వాటిని గీత ప్ర‌క‌టిస్తారు.   గీత ప్రారంభించ‌బోయే పార్టీ స్వ‌రూపం ఎలాగుంటుందో మాత్రం అప్ప‌టి వ‌ర‌కూ స‌స్పెన్సే. 


మొద‌టి ప్ర‌య‌త్నంలోనే గెలుపు


రెవిన్యూశాఖ‌లో అధికారిగా ఉన్న కొత్త‌ప‌ల్లి గీత (ఎస్టీ ?) 2014లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. వైసిపి త‌ర‌పున విశాఖ‌ప‌ట్నం జిల్లా అర‌కు పార్ల‌మెంటు స్ధానానికి ఎంపిగా పోటీ చేశారు.  రాజ‌కీయాల‌కు ఎటువంటి సంబంధం లేక‌పోయినా పోటీ చేసిన మొద‌టిసారే విజ‌యం సాధించారు. అయితే, కొంత కాలానికే జిల్లాలోని  పార్టీ నేత‌ల‌తో విభేదాలు ప్రారంభ‌మ‌య్యాయి. దాన్ని అవ‌కాశంగా తీసుకున్న కొత్త‌ప‌ల్లి టిడిపి నేత‌ల‌తో ట‌చ్ లోకి వెళ్ళారు. దాంతో హ‌టాత్తుగా వైసిపి నుండి టిడిపిలోకి ఫిరాయించేశారు.

ఏ పార్టీలోనూ చేర‌లేకే...


కొంత కాలం టిడిపిలో బాగానే ఉన్నారు. కానీ అక్క‌డేమైందో ఏమో ? చ‌ంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా విమ‌ర్శ‌లు, ఆరోప‌ణులు  మొద‌లుపెట్టారు. దాంతో టిడిపి నేత‌లు కూడా దూరం పెట్టేశారు. అంటే ఇటు వైసిపి  అటు టిడిపి రెండు పార్టీల‌తోనూ గీత‌కు చెడింద‌ది. దాంతో ఏమి చేయాలో దిక్కుతెలీలేదు. మ‌ధ్య‌లో  బిజెపివైపు కూడా ఊగారు. కానీ ఎందుకో చేర‌లేదు. ఏ పార్టీలోనూ చేర‌టానికి అవ‌కాశం క‌న‌బ‌డ‌లేదు. అందులోనూ  ఎంపి హోదాను రుచి చూశారు క‌దా ? అందుకే రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌లేక తానే సొంతంగా పార్టీ పెడుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: