ఇటీవల పడిన వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అక్కడున్న ప్రజలను వారి స్థితిగతులను దారుణమైన స్థితి లో పడేసిన విషయం మనకందరికీ తెలిసినదే. దాదాపు అధికార లెక్కల ప్రకారం 20వేల కోట్ల ఆస్తి మేరకు కేరళ రాష్ట్రానికి వాటిల్లిందని సమాచారం. ఈ క్రమంలో కేరళ రాష్ట్రం దుస్థితి తెలిసికొని ప్రపంచంలో ఉన్న చాలామంది ప్రముఖులు అలాగే దేశాధినేతలు కేంద్ర ప్రభుత్వం విరాళాలుగా అలాగే పలు హామీలు గా కేరళ రాష్ట్రానికి అండగా నిలవడం జరిగింది.

Related image

ఈక్రమంలో ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రులు అలాగే పలువురు రాజకీయ నాయకులు తమ వంతుగా అధికారికంగా తమ తమ రాష్ట్రాల తరుపున విరాళాలు ప్రకటించారు. ఇదిలావుండగా తాజాగా ఇటీవల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ టీంతో మూడో టెస్ట్ గెలిచిన నేపద్యంలో మూడో టెస్ట్ విజయాన్ని కోహ్లీ కేరళ రాష్ట్రానికి అంకితం చేశాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పిన్నరయి విజయన్ సంతోషం వ్యక్తం చేశారు.

Image result for kerala

భారత జట్టు విజయాన్ని కెప్టెన్ కోహ్లి కేరళకు అంకితం చేయడం చాలా సంతోషమని పేర్కొన్నారు కేరళ సీఎం. ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టు విజయాన్ని బుధవారం కేరళ బాధితులకు అంకితం ఇస్తున్నట్టు టీమిండియా కెప్టెన్ కోహ్లీ ప్రకటించాడు. ఈ విజయాన్ని కేరళ వరద బాధిత కుటుంబాలకు అంకితం ఇచ్చినట్లు తెలిపాడు.

Image result for kerala cm

ఇంగ్లండ్ లో ఉండి గేమ్ ఆడుతున్నా కూడా వారి ఆలోచల్లో కేరళ ప్రజలు ఉన్నారని సీఎం తెలిపారు. కేరళ కోలుకోవాలని ప్రపంచమంతా ఆకాంక్షిస్తుందన్నారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో వరద నీరు తగ్గుముఖం పట్టింది..ఈ పరిణామంతో చాలామంది పునరావాసాలు నుండి తమ ఇళ్లకు చేరుకుని శుభ్రం చేసుకునే కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: