ఆయన టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్. అన్న నందమూరి పిలిచి మరీ టికెట్ ఇచ్చి మంత్రిని చేసిన చరిత్ర ఉన్న నాయకుడు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ఆ విషయమైనా డేరింగ్ గా చెప్పగలిగే ఖలేజా వున్న మంత్రి ఆయన. తాజాగా ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ తో పార్టీ అధినాయకునికే సవాల్ చేశారు.  ప్రస్తుతం విశాఖ టూర్లో  చంద్రబాబు ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకుంటారో మరి.


కలిస్తే సహించేది లేదు :


టీడీపీ అన్నది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. మా విధానమే ఆ పార్టీకి భిన్నం. అటువంటిది మేము కాంగ్రెస్ లో కలవడం అన్న ప్రశ్నే తలెత్తదు అంటూ ఖరాఖండీగా మంత్రి అయ్యన్న ఈ రోజు విశాఖలో మీడియా ముందు కుండబద్దలు కొట్టారు. ఈ విషయంలో తాను అధినేత చంద్రబాబు నైనా వ్యతిరేకిస్తానంటూ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో కార్యకర్తల మనోభావాలకు విరుధ్ధంగా ఎటువంటి నిర్ణయాలు జరగవని కూడా ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీకి వైసీపీతో పాటు కాంగ్రెస్ కూడా రాజకీయ ప్రత్యర్ధే అని క్లారిటీ ఇచ్చారు. 


బాబుకు ఇరకాటమే :


అసలే కాంగ్రెస్ తో మైత్రి ప్రచారంపై  విపక్షం ఓ వైపు ఏకేస్తున్న టైంలో సొంత పార్టీకి చెందిన సీనియర్ మంత్రి ఇలా బాహాటంగా బాబు పై ఇండైరెక్ట్ గా అటాక్   చేయడం కలకలం రేపుతోంది. నిజానికి కాంగ్రెస్ తో కలిసే విషయంపై గత మూడు నెలలుగా జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినా మంత్రికి తెలియకుండా ఉంటాయా అన్నది ఆలోచించాలి.  మరి ఈ టైంలో అయ్యన్న ఇలా అన్నారంటే అర్ధాలు ఏమై ఉంటాయాన్నది కూడా ఆసక్తికరమైన చర్చగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: