జనసేనాని పవన్ కళ్యాణ్ ఇకపై నో రెస్ట్, నో బ్రేక్స్ అంటున్నారు. ఈసారి చేసే టూర్ ఎన్నికలు అయిపోయేంతవరకు సాగుతుందట. అందుకోసం కంప్లీట్ షెడ్యూల్ ని రెడీ చేసుకుని మరీ జనంలోకి రావాలనుకుంటున్నారు. అంటే దాదాపు ఆరేడు నెలల పాటు పవర్ స్టార్ రోడ్ల మీదే టూర్లు చేస్తూ ఉంటారన్న మాట.  సెప్టెంబర్ 12 నుంచి నిరంతర ప్రచారంతో ఏపీని హోరెత్తిస్తారట.


అమీ తుమీ :


ఈసారి పర్యటనలు పకడ్బంధీగా చేయాలని పవన్ డిసైడ్ అయ్యరట. ఇంతకు మునుపులా సడెన్ గా బ్రేకులు ఇవ్వడం, రెస్ట్ పేరు చెప్పి ఆగిపోవడం అసలు చేయకూడదని అనుకుంటున్నారుట. అందుకు తగిన సరంజామాతో బరిలోకి దిగిపోతున్నారుట. ఒకసారి టూర్ మొదలుపెడితే అది ఎన్నికల ప్రచారం చివరి రోజు వరకు అలా కొనసాగాల్సిందేనని జనసేన గట్టిగా  అనుకుంటోందట.


ప్రత్యేక రధంతో :


ఈసారి పవన్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న రధం పైనే తన టూర్ మొదలుపెడతారని సమాచారం. అన్ని హంగులు ఉన్న ఆ రధాన్ని పవన్ దగ్గరుండి తయారుచేయించుకున్నారు. అందుకో రెస్ట్ తీసుకోవడానికి, సమావేశాలు పెట్టడానికీ ఏర్పాట్లు ఉన్నాయి. దాంతో పవన్ అప్పటి అన్న గారిలా రధంలోనే  భోజనం, నిద్ర చేస్తూ ఏపీని మొత్తం చుట్టేస్తారని టాక్.


నేతలకు స్వాగతం :


జనసేనలో చేరేవారికి పవన్ తన టూర్లో స్వాగతం పలకనున్నారు. ప్రతి జిల్లాలో ఇకపై పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని జనసేన వర్గాలు అంటున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి చాలామంది జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా నచ్చిన వారిని చేర్చేసుకుంటూ పవన్ ఎన్నికల ప్రచారంలోకి దిగిపోతారని అంటున్నారు. మొత్తానికి పవన్ టూర్ ఓ రేంజిలో సాగుతుందని భోగట్టా.

 


మరింత సమాచారం తెలుసుకోండి: