పోయిన ఎన్నిక‌ల్లో వైసిపికి బాగా మ‌ద్ద‌తిచ్చిన రెండు వ‌ర్గాల‌పై చంద్ర‌బాబునాయుడు క‌న్నేశారు. అస‌లే తెలుగుదేశంపార్టీ ప‌రిస్ధితి ఏమంతా బావోలేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డే  కొత్త వ‌ర్గాలేవీ క‌న‌బ‌డ‌టం లేదు. పైగా పోయిన ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తిచ్చిన వ‌ర్గాలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తుగా నిల‌బ‌డేది అనుమాన‌మే. అందుక‌నే వైసిపికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డిన వ‌ర్గాలను త‌న‌వైపుకు తిప్పుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు.


టిడిపిలోకి లాక్కున్నారు


ఇంత‌కీ విషయం ఏమిటంటే పోయిన ఎన్నిక‌ల్లో ఎస్సీ, ఎస్టీల‌తో పాటు ముస్లిం మైనారిటీలు కూడా జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ్డారు. అందువ‌ల్లే ఎస్సీలు మిన‌హా ఎస్టీలు, మైనారిటీల్లో టిడిపి త‌ర‌పున పోటీ చేసిన వారిలో ఏ ఒక్క‌రూ గెల‌వ‌లేదు. అందుక‌నే ఇద్ద‌రు ముస్లిం మైనారిటీల‌తో పాటు ఎస్సీ,  ఎస్టీ ఎంఎల్ఏలు, ఎంపిల‌ను చంద్ర‌బాబు వైసిపిలో నుండి టిడిపిలోకి లాక్కున్నారు. వాళ్ళ‌ని లాక్కున్నా ఇంత వ‌ర‌కూ వాళ్ళ‌కి పెట్టిన కిరీటం ఏమీ లేద‌నుకోండి అది వేరే సంగ‌తి.


వైఎస్ వ‌ల్లే ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్లు

Image result for ysr photos

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ హ‌యాంలో ముస్లింల‌కు క‌ల్పించిన రిజ‌ర్వేష‌న్ల కార‌ణంగా వారంతా మొన్న‌టి ఎన్నిక‌ల్లో వైసిపికి అండ‌గా నిల‌బ‌డ్డారు. అందులోనూ పోయిన ఎన్నిక‌ల్లో బిజెపితో క‌లిసి చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌ను ఎదుర్కొన్న ఫ‌లితంగా మైనారిటీల ఓట్ల కోసం చంద్ర‌బాబు ఆశ‌ప‌డినా లాభం లేక‌పోయింది. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా నాలుగేళ్ళ‌పాటు బిజెపితో అంట‌కాగిన కార‌ణంగా ముస్లింలెవ‌రూ చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిల‌వ‌లేదు. ప‌నిలో ప‌నిగా ఎస్టీలు కూడా పూర్తిగా జ‌గ‌న్ కే మ‌ద్ద‌తు గా నిల‌బ‌డ్డారు. 


జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డిన వర్గాలు


పోయిన ఎన్నిక‌ల్లో కాపు, బిసి సామాజిక‌వ‌ర్గాల‌తో పాటు ఇత‌రుల‌ను ఆక‌ట్టుకునేందుకు చంద్ర‌బాబు త‌ప్పుడు హామీల‌ను చాలానే ఇచ్చారు. దానికితోడు బిజెపితో పొత్తు, ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తుగా నిల‌బ‌డినా అతిక‌ష్టం  మీద చంద్ర‌బాబు గ‌ట్టెక్కారు. ఇపుడు బిజెపి, జ‌న‌సేనలు చంద్ర‌బాబుతో విడిపోయిన కార‌ణంగా చంద్ర‌బాబులో ఆందోళ‌న పెరిగిపోతోంది. కొత్త‌గా ఆక‌ట్టుకునేందుకు ఏ సామాజిక‌వ‌ర్గం లేని కార‌ణంగా వైసిపికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డిన ముస్లింలు, ఎస్సీల‌పై చంద్ర‌బాబు క‌న్నుప‌డింది. 


కోట్లు ఖ‌ర్చు చేస్తున్నా ఉప‌యోగ‌ముంటుందా ?


పై సామాజిక‌వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేందుకే ద‌ళిత తేజ‌మ‌ని, నారా హ‌మారా అనే ప్రోగ్రాములతో హ‌డావుడి చేస్తున్నారు. ఒక విధంగా ద‌ళిత తేజం పెద్ద‌గా స‌క్సెస్ కాలేదనే చెప్పాలి.  ఇక‌, నారా హ‌మారా ప్రోగ్రామ్ ఈనెల 28వ తేదీన గుంటూరులో భారీ ఎత్తున నిర్వ‌హిస్తున్నారు.  చంద్ర‌బాబు ఏ కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా ఖ‌ర్చు కూడా భారీ ఎత్తునే అవుతుంది. మ‌రి అన్ని కోట్లు పెట్టి నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాలు ఏ మేరకు స‌క్సెస్ అవుతాయో చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: