చాలాకాలంగా విశాఖ జిల్లా రాజకీయాలలో నలుగుతున్న ఓ విషయంలో ఇపుడిపుడే క్లారిటీ వస్తోంది. జిల్లాను శాసిస్తున్నా ఆ మంత్రి గారు పార్టీ మారరన్నది తేలిపోయింది. ఈ మేరకు హై కమాండ్ తో ఆయనకు ఉన్న సంబంధాలు గతం కంటే కూడా బాగా బలపడ్డాయి. రేపటి ఎన్నికలలో ఆయన జిల్లా రాజకీయాలలో  మరో మారు చక్రం తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది.


రూట్ క్లియర్ :


రెండు నెలల క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావు  అలిగారు. ఏకంగా అధినేత మీదనే కోపం వచ్చింది. ఓటమి ఎరగని తనను టీడీపీకి   అనుకూలంగా ఉండే ఓ మీడియా పరాజయం పాలు చేసిందని ఆయన తీవ్రంగా కలత చెందారు. ఇదంతా పార్టీలోనే జరుగుతున్న కుట్రగానూ భావించారు. దాంతో ఏకంగా సీఎం మీటింగ్ కే డుమ్మా కొట్టాలనుకున్నారు. అప్పటికి టెంపరరీగా సర్దుబాటు జరిగినా గంటా మనసు మాత్రం మారలేదని తరువాత సంఘటనలు నిరూపించాయి.

 అయితే ఈ మధ్యలో ఏం జరిగిందో కానీ హై కమాండ్ లో ఇంతకు ముందు కంటే ఎక్కువగానే  ఇపుడు రిలేషన్స్ బాగున్నాయి. ఆయన పట్ల చంద్రబాబు కూడా మంచి నమ్మకంతో  ఉన్నారు. సో. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళే సమస్యే లేదని పార్టీ వర్గాలు బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి.


మారిన పరిణామాలేనా :


ఈ రెండు నెలల టైంలో ఏపీలో అనేక రాజకీయ పరిణామాలు చాల వేగంగా మారాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ కాపుల రిజర్వేషన్ల విషయంలో చేతులెత్తేయడంతో ఆ సామాజికవర్గం అలెర్ట్ అయింది. అందులో భాగంగానే వైసీపీ వైపు చూసే బిగ్ షాట్స్ వెనక్కు వెళ్ళిపోయాయి. అందులో భాగంగానే గంటా డెసిషన్ కూడా ఉందని టాక్. ఇక ఏపీలో టీడీపీ అందరూ అనుకున్నత బలహీనంగా ఏమీ లేదు. దానికి తోడు బాబు స్ట్రాటజిక్ వ్యూస్ పార్టీని మళ్ళీ గెలిపిస్తాయన్న ధీమా ఈ మధ్యన బాగా పెరిగింది. అది మరో రీజన్.



ఇక హై కమాండ్ నుంచి చూసుకుంటే గంటా వంటి డైనమిక్ లీడర్ ఉండడం పార్టీకి ప్లస్ అన్నది బాబు ఇంతకు ముందు కంటే ఇపుడు బాగా గుర్తించారని టాక్. దాంతో ఆయన ప్రయారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. బలమైన కాపు మంత్రులలో గంటాదే ఫస్ట్ ప్లేస్. ఇలా అన్నీ కలసి గంటా పసుపు శిబిరం గడప దాటకుండా కట్టిపడేశాయంటున్నారు. సో ఏమైనా అనూహ్య  పరిణామాలు జరిగితే తప్ప గంటా టీడీపీలో ఉండడం డాం ష్యూర్ అంటునారు .


మరింత సమాచారం తెలుసుకోండి: