ఉత్తరాంధ్ర జిల్లాలు అంటేనే చాలు టీడీపీకి కంచుకోటలన్న మాట వెంటనే వస్తుంది. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా సైకిలెక్కేసిన జనం ఇక్కడ ఉన్నారు. అంతలా పాతుకుపోయిన పార్టీ అది. పైగా సంస్థాగతంగా బాగా  స్ట్రాంగ్. బూత్ లెవెల్ వరకూ క్యాడర్ తో పటిష్టంగా  ఉన్న పార్టీ. అటువంటి చోట మిగిలిన పార్టీలకు జనం రావడం కష్టమే. మరిక్కడ జరుగుతోందేమిటి..


ఎక్కడ చూసినా అదే సీన్ :


మరి జగన్ పాదయాత్రకు మాత్రం జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఎక్కడ చూసిన ఇసుక వేస్తే రాలనంతగా జనం కనిపిస్తున్నారు. జగన్ తో అడుగులు వేసి నడుస్తున్నారు. పండుగలు సైతం ఆయనతోనే అంటున్నారు. వరలక్ష్మీ వ్రతం రోజు కూడా మహిళలు జగన్ కి నీరాజనం పట్టారంటే అది ఊహించలేని స్పందనే. ఇక వానలో కూడా వెంట వస్తున్నారు. మీటింగ్ పెడితే గంటల తరబడి కాచుకుని ఉంటున్నారు.


మాడు పగిలేలా ఆ మూడూ :


అక్కడ ఉన్నది టీడీపీ సామ్రాజ్యం. మంత్రులు, సామంతులు ఉన్న ఏరియా. అలాంటి చోట జరిగిన మూడు సభలు ప్రత్యర్ధి మాడు పగిలేలా హిట్ అయ్యాయి. నర్శీపట్నం, కోటఉరట్ల, ఎలమంచిలి మీటింగులు ఓ రేంజిలో అదిరిపోయాయి.  ఎలమంచిలి మీటింగ్ అయితే జగన్ తో పాటు వానలోనే తడుస్తూ జనం ఓపికగా విన్నారు. మీరు తడవడం నాకు  ఇష్టం లేదు. అందుకే మీటింగ్ ఆపేస్తాను అని జగన్ అన్నా వినిపించుకోకుండా  కోరి మాట్లాడించుకున్నారు. 


దేనికి సంకేతం :


నర్శీపట్నంలో మంత్రి అయ్యన్న ఉన్నారు. కోటవురట్ల పాయకరావుపేట ఎమ్మెల్యే అనితది, ఎలమంచిలి టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబుది ఈ ముగ్గురూ డైనమిక్ లీడర్లే. అక్కడ పార్టీ కూడా గట్టిగానే ఉంటుంది. అయినా జగన్ తో జనం రావడానికి కారణం ఏంటన్న దానిపైన టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. పవన్ వస్తే సినిమా గ్లామర్ అనుకోవచ్చు. జగన్ దగ్గర ఏముంది. పైగా వానలో కూడా అంత సేపు ఎందుకు నిలుచోవాలి. ఇది దేనికి సంకేతం. ప్రస్తుతం ఇదే టీడీపీలో పెద్ద ప్రశ్న. వెంటనే ఆన్సర్ దొరికితే రిపేర్లు ఉండొచ్చేమో. టైం మించిపోతే మాత్రం బ్యాలెట్ బాక్సే అసలైన జవాబు చెబుతుంది మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: