వైసీపీలో కొత్త రక్తం జోరందుకుంటోంది. రాజకీయాలోకి రావాలనుకుంటున్న వారికి ఇపుడు ఏపీలో ఫస్ట్ ఆపషన్ గా వైసీపీ కనిపించడం విశేషం. నిన్నటి వారకూ ఏపీలో పోలీసులను శాసించిన బాస్ మాజీ డీజీపీ సా,బశివరారు వైసీపీలో చేరబోతున్నారు. ఇది నిజంగా ఆ పార్టీకి బూస్టప్ లాంటి నిర్ణయమే. మేదావుల చూపు ఇటు వైపు ఉందనడానికి ఇదొక ఉదాహరణ అంటున్నారు.


జగన్ తో భేటీ :


వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు ఈ రోజు రాంబిల్లి మండలం హరిపురంలో క‌లిశారు. వైసీపీలో సాంబశివరావు చేరుతున్నట్లు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. సాంబశివరావు చేరికతో వైసీపీకి అదనపు బలం వచ్చిందని చెప్పారు.  గతంలో సాంబశివరావు ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 1984 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సాంబశివరావు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఇన్‌చార్జీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు.

1987లో ఆదిలాబాద్ ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఏపీలోని ఒంగోలులో మిరియాల పాలెంకు చెందిన రామకోటయ్య, సూరలమ్మకు జన్మించారు. సామాన్య కుంటుంబం నుంచి వచ్చిన ఆయన డీజీపీ స్థాయికి ఎదిగారు. 


ఇంటెలెక్చువల్స్ అంటేనే ఓ లెక్క :


వైసీపీలో మేధావుల చేరిక పెరుగుతోంది. ఇటీవలే ఐపీఎస్ అధికారి ఇక్బాల్ కూడా వైసీపీలో చేరారు. ఇపుడు సాంబశివరావు  రాకతో పోలీస్ బాస్ ల డెసిషన్ కరెక్ట్ గానే ఉంటుందని మరో మారు ప్రూవ్ అవుతోంది. ఓ మీటింగ్ జరిగితే జనం ఎంత వచ్చారు. ఏమనుకుంటున్నారు అన్నది మొదటి అంచనా వేసేది పోలీసులే. అటువంటి పోలీస్ బాస్ లు ఇపుడు వైసీపీ రూట్ పట్టారంటేనే రేపటి ఎన్నికలలో జనం మూడ్ ఏంటన్నది చెప్పకనే చెబుతోందంటున్నారు.

సాంబశివరావు ను టీడీపీ ఏరీ కోరీ డీజీపీగా నియమించింది. అటువంటి  అధికారి అధికార పార్టీ వైపు కాకుండా విపక్షం వైపు వచ్చారంటేనే గాలి ఏంటో అర్ధమైపోతోంది.  మొత్తానికి జగన్ విశాఖ టూర్లో మరిన్ని అనూహ్య చేరికలు ఉంటాయనై వైసీపీ ధీమాగా చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: