చంద్ర బాబు వ్యవహార శైలి చివరికి అధికారులు కు కూడా నచ్చడం లేదు . ఎన్నికల దగ్గర పడే కొద్దీ ఒక్కొక్కరు జగన్ గూటికి చేరుతున్నారు అయితే విచిత్రంగా చంద్ర బాబు కు సన్నిహితంగా ఉంటున్న అధికారులు మాజీ ఐఏఎస్ ఐపీస్ అధికారులు కూడా జగన్ గూటి దగ్గరికి చేరుతున్నారు.  ఏరికోరి ఎంచుకుని ప్రధాన కార్యదర్శిగా తెచ్చుకున్నారు ఐవైఆర్ కృష్ణారావును. ఆయన రిటైర్ కాగానే  మంచి పదవి కూడా ఇచ్చారు. అయినా ఆయన తిరుగుబాటు బావుటా ఎగరేసారు.

Image result for chandra babu

బాహాటంగా కాకపోయినా, ప్రస్తుతం వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మద్దతు దారుగా వున్నారు. నిత్యం తన వ్యాసాలతో, ట్వీట్ లతో బాబుకు, తెలుగుదేశంకు పక్కలో బల్లెంగా మారారు. చంద్రబాబు ఏరికోరి ఆర్టీసీ ఎండీగా, ఆపై డీజీపీగా నియమించిన సాంబశివరావు కూడా జగన్ శిబిరంలో చేరిపోయారు. ఆయన కూడా ఇటీవల రిటైర్ అయిపోయిన అధికారే. నిజానికి సాంబశివరావుకు ప్రత్యేకంగా బాబు మనిషి అని పేరు వుంది. అలాంటిది ఆయన జగన్ శిబిరంలో చేరడం విశేషం.

Image result for chandra babu

మరో ఐపీఎస్ అధికారి ఇక్బాల్ కూడా బాబును కాదని ప్రతిపక్షంలో చేరారు. బాబు ఏరికోరి దగ్గరకు తీసుకున్న చాలామంది ఇలాగే ఆయనకు హ్యాండ్ ఇచ్చిన సంఘటలు గతంలో కూడా వున్నాయి.  వీరంతా ఎందుకు తమకు లిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబును వదిలేస్తున్నట్లు? అసలు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నట్లు? జగన్ పార్టీలో ఎందుకు చేరుతున్నట్లు? చంద్రబాబును దగ్గర నుంచి చూడగానే ఆయన అసలు సిసలు వ్యవహారాలు వారికి అర్థమైపోయాయి అనుకోవాలా? లేక చంద్రబాబును దగ్గర నుంచి చూడడం ద్వారా ప్రభుత్వం ఏ విధంగా నడుస్తోందో? తెరవెనుక ఏం జరుగుతోందో? తెలుస్తోందా? మొత్తంమీద ఎందుకో దగ్గరగా దర్శించిన వారందరికీ చంద్రబాబు నచ్చడంలేదు అనుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: