ఎన్నికలలో గెలుపునకు ఎన్నో  ఫ్యాక్టర్స్ పని చేస్తాయి.  పార్టీకి ఊపు ఉంటే సరిపోదు. కరెక్ట్ టైంలో కరెక్ట్ లీడర్స్ కూడా దొరకాలి. అలా దొరికితే ఆ పోరు యమ రంజుగా ఉంటుంది. వైసీపీకి కూడా సరిగ్గా అలాంటి  క్యాండిడేట్ ఒకరు దొరికారని టాక్ నడుస్తోంది. మరి ఎక్కడ పోటీ..అది ఎలా ఉండబోతోందన్నది ఇంటరెస్టింగ్ మ్యాటరే మరి.


ఆమెకు టిక్కెట్ :


పాడేరు వైసీపీకి కంచుకోట. అక్కడ పోయిన ఎన్నికలలో గిడ్డి ఈశ్వరిని నిలబెడితే మంచి మెజారిటీతో గెలిచారు. మూడేళ్ళ పాటు పార్టీలో ఉన్న ఆమె ఈ మధ్యనే అధికార టీడీపీ వైపు వెళ్ళిపోయారు. వచ్చే ఎన్నికలలో ఆమె అక్కడ టీడీపీ క్యాండిడేట్. ఆమెకు పోటీ ఇచ్చే వారి కోసం వైసీపీ ఇన్నాళ్ళుగా చేస్తున్న వేట సక్సెస్ అయిందంటున్నారు. పాడేరు అసెంబ్లీ ఒకప్పటి రూపమైన చింతపల్లి మాజీ ఎమ్మెల్యే దేముడు కూతురుకు టికెట్ ష్యూర్ అంటున్నారు.


వైసీపీలో చేరిక :


జగన్ సమక్షంలో దేముడు కుమార్తె మాధవి వైసీపీలో చేరిపోయారు. ఆమె తన తండ్రి లాగానే సీపీఐ రాజకీయాలలో ఉన్నారు. అయితే ఇపుడు హటాత్తుగా వైసీపీ వైపు వచ్చేశారు. గిరిజనంలో దేవుడిలా ఆరాధించే మాజీ ఎమ్మెల్యే దేవుడు కుటుంబానికి ఎంతో ఆదరణ ఉంది. పైగా అక్కడ కమ్యూనిస్టులకూ  గట్టి  పట్టు ఉంది. మరో వైపు వైసీపీకీ బలం వుంది. అన్నీ కలిస్తే మాధవి గెలుపు ఖాయమంటునారు.


ఆమెని వచ్చే ఎన్నికలలో పాడేరు నుంచి ఈశ్వరికి పోటీగా దింపుతారని అంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే పట్ల పాడేరులో వ్యతిరేకత ఉంది. అది తమకు ప్లస్ అవుతుందని వైసీపీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. మొత్తానికి పాడేరు లో మళ్ళీ జెండా ఎగరేయడానికి వైసీపీ రెడీ అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: