అదేంటో కొందరు నాయకులు తీరు ఎపుడూ మారదు, వారికి పార్టీలతోనూ, నడుస్తున్న సీజన్లతోనూ అసలు పని ఉండదు, వారి నోటికి ఎంత వస్తే అంతే. ఏరి కోరి వారిని తెచ్చుకున్నందుకు ఈ తల నొప్పులు భరించక తప్పదు. లేటెస్ట్ మళ్ళీ ఆ పెద్దాయాన షాకింగ్ కామెంట్స్ చేశారు. దాంతో మొత్తం ప్రోగ్రాం అప్సెట్  అయిపోయింది.


వేస్ట్ అంటున్న జేసీ :


ధర్మ పోరాట దీక్షలు అంటూ బాబు నాలుగు నెలల క్రితం తెర తీశారు. ఎన్ని ఇతర కార్యక్రమాలు ఉన్నా పోరాట దీక్షలను మాత్రం ఆయన ఎన్నికల వరకూ అలా కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు. వీటిని సర్కార్ ఖర్చుతో ఎన్నికల మీటింగులుగా బాబు వాడేసుకుంటున్నారు. కేంద్రంపైనా, మోడీ పైనా, ఏపీలో విపక్షాలపైన దుమ్మెత్తిపోసేందుకు బాబు ఎంచుకున్న అతి ఇష్టమైన ప్రోగ్రాం అది. అటువంటి దీక్షలను అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి  ఒక్క మాటతో వేస్ట్ అనేశారు. ఏకంగా చంద్రబాబు ముందే అయన ఇలా అనేయడంతో ఖంగు తినడం అధినేత వంతు అయింది.



ఉన్న కాలమంతా చంద్రబాబు ధర్మపోరాటం అంటూ తిరిగితే దున్నపోతుపై వర్షం కురిసినట్లేనని జేసీ ఏకంగా  బహిరంగ సభలోనే వ్యాఖ్యానించి  దెబ్బ తినిపించేశారు.  చంద్రబాబు ధర్మపోరాటంతో ఇంటింటికి వెళ్లి చెప్పనవసరం లేదని ముఖం మీదే కుండబద్దలు కొట్టారు. బీజేపీ గురించి కొత్తగా చెప్పనవసరం లేదని, ఆ పార్టీకి ఒక్క ఓటూ రాదని కూడా తేల్చేసారు.

గాలి తీసేశారుగా :


ఇలా సభలోనే పెద్దాయన చేసిన హాట్ కామెంట్స్ తో బాబు గాలి తీసేసినట్లయింది. చెప్పినదే చెప్పుకుంటూ విలువైన కాలమంతా ఇలాసభల పేరుతో  వ్రుధా చేస్తున్నారన్న  అర్ధంతో జేసీ అనడాన్ని టీడీపీ పెద్దలు జీర్నించుకోలేకపోతున్నారు. బాబు ఆయనను ఏం అనలేక పోవడం కూడా జేసీ కామెంట్లు చేసేందుకు తరచూ చాన్స్ గా తీసుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి బాబు దీక్షలకు జనం మద్దతు మాట‌ దేముడెరుగు, పార్టీలోనే పెదవి విరుపుతో పరువు పోతోందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: