అన్ని నెలలూ ఒక ఎత్తు, ఆ ఇంగ్లీష్ నెల మరో ఎత్తు. ఏపీ రాజకీయాలను అప్పటికీ, ఇప్పటికీ  శాసిస్తున్న ఆ ఘనమైన నాయకునికి ఆ మంత్ తోనే విడదీయని బంధం ఉందంటే ఆశ్చర్యమే మరి. ఆ నెల పేరు చెబితే ఆయనతో పాటు ఆయన గారి పార్టీ కూడా ఉలిక్కిపడుతుంది. ఎన్నో షాకింగ్ ఇన్సిడెంట్స్, చరిత్రలో నిలిచిపోయే ఘటనలు జరిగిన నెల అది. ఆ నెల గురించి మాట్లాడుకోవడమే ఇంటెరెస్టింగ్ గా ఉంటుంది.


అలా మొదలైంది :


తెలుగుదేశం రాజకీయాలకు, ఆగస్ట్ నెలకూ అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా చంద్రబాబుకు ఇంకా ఎక్కువగా ఉంది. ఆయన జీవితాన్ని మార్చేసిన నెల అది. మంచీ చెడ్డా అన్నీ ఎక్కువగా ఈ నెలలోనే జరిగిపోయాయి. ముందుగా మంచి గురించే మాట్లాడుకుంటే 1984 ఆగస్ట్ లో టీడీపీ లో ఓ తుపాన్ పుట్టింది. నాదెండ్ల భాస్కరరావు అన్న గారిని గద్దె నుంచి దించేసి సీఎం అయిపోయారు అప్పట్లో.  దాంతో అన్న గారు పదవీచ్యుతులయ్యారు. పార్టీ ఉనికి ప్రశ్నార్ధకమైంది. 


అడుగు పడిందలా :


ఆ టైంలో రాజకీయంగా కొత్త అయిన అన్న నందమూరి తల్లడిల్లిపోయారు. అప్పటికే కాంగ్రెస్ లో మంత్రిగా ఓడిపోయిన చంద్రబాబు టీడీపీలో  కొత్తగా వచ్చి చేరారు. . ఆయనకూ అది పరీక్షా సమయమే. అన్న నందమూరి పార్టీ ఎమ్మెల్యేలను బెంగలూర్ తరలించి క్యాంప్ ని బాగా నిర్వహించి కాంగ్రెస్  కుట్ర ఓడిపోయేలా చేయడంలో చంద్రబాబు గ్రేట్ జాబ్ మరువలేనిదే. ఇలా ఆగస్ట్ ఆయనకు టీడీపీలో గట్టి అడుగు పడేలా చేసింది.


అదే నెల అలా :


ఇక అదే ఆగస్ట్ నెల 1995. మరో మారు అన్న గారి మీద కుట్ర జరిగింది. ఈసారి చేసింది అచ్చంగా కుటుంబసభ్యులే. నాయకత్వం వహించింది చంద్రబాబు అండ్ కో. అలా ఆగస్ట్ బాబుకు పగ్గాలు అందించి సీఎం ని చేసేసింది. ఇదే నెల 27న వైస్రాయ్ హొటల్ వద్దకు వచ్చిన అన్న గారి చైతన్య రధంపై రాళ్ళు వేసిన ఘటనా చోటు చేసుకుంది. ఆ క్యాంప్ లో బాబు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రోజున అన్న గారి మనో వేదన వర్ణించరానిదే. నేను ఈ రోజే చనిపోయాను అని ఆయన అన్న మాటలు నాడు చూసిన వారికి కన్నీరు తెప్పించాయి.


మళ్ళీ అదే డేట్ :


ఇక బాబు సీఎం గా అయిదేళ్ళు పాలన తరువాత 2000 ఆగస్ట్ 28న మరో చారిత్రాత్మకమైన ఘటన జరిగింది. అప్పట్లో బాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీలు బాగా పెంచింది. దానికి నిరసనగా కాంగ్రెస్ సహా అన్ని పార్టీలూ ఆందళన నిర్వహించాయి. చిరరి రోజున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తలపెట్టాయి. సరిగ్గా బషీర్ బాగ్ వద్దకు రాగానే పోలీసులు ఉద్యమకారులను చెదరగొట్టారు. ఏకంగా కాల్పులే కాల్చారు. 
ఈ దుర్ఘటనలో రామ‌కృష్ణ‌, బాల‌స్వామి, విష్ణువ‌ర్ధన్‌రెడ్డి అనే ముగ్గురు పోలీస్ తూటాలకు బలి అయ్యారు.
ఈ ఘటన తరువాతే కేసీయార్ టీడీపీకి గుడ్ బై చెప్పేసి టీయారెస్ ఏర్పాటు చేశారు.  ఆ దెబ్బకు పదేళ్ళ పాటు బాబు పవర్ కి దూరమయ్యారు. ఆగస్ట్ ఇలా బాబు జీవితంలో ఎన్నో ఘటనలకు కారణంగా నిలిచింది. అందుకే ఆగస్ట్ అంటే బాబుకూ ఆయన గారి టీడీపీకి కూడా ఓ విధంగా వణుకు తెప్పిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: