మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ ఇప్పుడు జగన్ వైపు చూస్తున్నారు. చంద్ర బాబు ప్రభుత్వం లో పని చేసిన వారికి బాబు గురించి మొత్తం భోదపడినట్టుంది. అందుకే జగన్ కు సపోర్ట్ చేస్తున్నారు.  కొన్నిరోజుల కిందట పాదయాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని సాంబశివరావు కలవడంతో.. ఆయన వైకాపాలో చేరబోతున్నారంటూ అనేక వార్తలు వచ్చాయి. అయితే జగన్ తో భేటీ తరువాత.. సాంబశివరావు పార్టీలో చేరే ప్రచారాన్ని ఖండించారు. ఈ పోకడపై అప్పుడే పలు సందేహాలు తలెత్తినా.. తాజాగా మంగళవారం చంద్రబాబుతో భేటీకావడం ఆసక్తికరంగా మారింది.

Image result for chandra babu

చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత.. మాజీ డీజీపీ మీడియాతో మాట్లాడారు. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని కూడా సెలవిచ్చారు. సమన్వయ లోపం కారణంగానే వైసీపీలో చేరుతున్నట్లు వారు ప్రకటించి ఉండవచ్చు అని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఇప్పట్లో లేదని, ప్రజలకు సేవ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయని మాజీ డీజీపీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గంగవరం పోర్టు సీఈవోగా ఉన్న ఆయన పోర్టు అభివృద్ధికి సలహాలు ఇవ్వడానికే సీఎంను కలిశానని, తనకు నామినేటెడ్ పోస్టుల ఆసక్తి లేదని, ఎన్నికల్లోకి వెళ్లే శక్తిలేదని చెప్పడం విశేషం.

Image result for jagan

 నిజానికి తనకు సీటు కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే సాంబశివరావు జగన్ కలిసినట్లుగా సమాచారం. అయితే చంద్రబాబు చక్రం తిప్పి.. ఆయనతో పార్టీలో చేరడం లేదనే ప్రకటన చేయించారని అంతా అనుకున్నారు. తాజాగా.. తనతో భేటీ అయినప్పుడు కూడా.. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంటే.. ఆయన కోరుకునే పదవిని తెలుగుదేశం తరఫున తానే ఇస్తానంటూ చంద్రబాబునాయుడు... మాజీ డీజీపీకి ఆశ చూపించినట్లుగా పలువురు అనుకుంటున్నారు. రాష్టస్థాయి హోదా ఉండేలా నామినేటెడ్ పదవి ఇవ్వడానికి కూడా సిద్ధమని చెప్పినట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: