అన్న నందమూరి  తారక రామారావు పుట్టిన ఊరు నిమ్మకూరు. ఆయన తరువాత అంతటి అనుబంధం ఆయన కుటుంబంలో ఒక్కరికే ఉంది. అన్న గారి కుమారుడు నందమూరి హరిక్రిష్ణ నిమ్మకూరుతో భావోద్వేగమైన బంధాన్ని పెనవేసుకోవడమే కాదు చివరి వరకూ కొనసాగించారు. ఆయన అక్కడే పుట్టారు, పెరిగారు, చదివారు. పెళ్ళి కూడా అక్కదే జరిగింది, ఇక భార్య లక్ష్మిది కూడా అదే ఊరు కావడం విశేషం. 


నిమ్మకూరు అంటే ప్రాణం :


అన్న గారి తరువాత నిమ్మకూరుని అమితంగా ప్రేమించింది ఆ కుటుంబంలో హరిక్రిష్ణ మాత్రమే. ఆయన రాజకీయ జీవితంలో పదవులు వరించింది తక్కువే. మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన హరిక్రిష్ణ నిమ్మకూరును మరచిపోకుండా అక్కడ అభివ్రుధ్ధి కార్యక్రమాలకు ఎంతో వెచ్చించారు. అలా పుట్టిన గడ్డ రుణం తీర్ఛుకున్నారు. 


అదే అఖరు :


ఇదిలా ఉండగా హరిక్రిష్ణ వీలు చిక్కినపుడల్లా తన సొంత ఊరుకి వస్తూండేవారని గ్రామస్తులు చెబుతున్నారు. వూరులోని ప్రతి ఒక్కరు అయనకు తెలుసు. అందరికీ పేరు పేరునా పలకరించే చనువు, అభిమానం హరి సొంతం. చివరి సారిగా హరి తన కుమారుడు కళ్యాణ్ రాం తో కలసి పోయిన ఏడాది నిమ్మకూరు వచ్చారని గ్రామస్తులు చెప్పారు.  హరి ఇక లేరన్న వార్తతో ఇపుడు నిమ్మకూరు తీరని ఆవేదనతో నిండా మునిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: