ఈ రోజు రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన నందమూరి హరిక్రిష్ణ జీవితం మొత్తం అన్న నందమూరి తారక రామారావు తీర్చిదిద్దబడిందే. తండ్రి అడుగులో అడుగు వేయడమే హరికి తెలిసింది. నాన్న ఏం చెబితే అది చేసేయడమే వచ్చు. తాత గారింట్లో నిమ్మకూరులో హరి పుట్టి అక్కడే పెరిగారు. అన్నగారి ప్రత్యక్ష పరోక్ష దర్శకత్వంలో బతుకు ఓనమాలు దిద్దారు. 


నిమ్మకూరు బంధం :


మొదట్లో తండ్రి కంటే తాత దగ్గరే చనువుగా ఉండే హరిక్రిష్ణ తండ్రిని ఎపుడో మద్రాస్ లో కలిసేవారు. అపుడు ఎంటీయార్ మద్రాస్ లో సూపర్ స్టార్ గా వెలిగిపోతున్నారు. క్షణం తీరిక లేని రోజులవి. అందరు పిల్లలూ అక్కడే. ఒక్క హరి మాత్రం నిమ్మకూరులో. ఎందుకంటే ఎంటీయార్ తండ్రి లక్ష్మయ్య చౌదరి తన వద్దనే హరిని ఉంచేయమనడంతో అలా జరిగింది.


సినిమాల్లోకి అలా  :


తాత లక్ష్మయ్య చౌదరి హరిని హీరోను చేయమనేవారట. అచ్చం తండ్రిలాగా ఉండే హరికి మంచి ఫ్యూచర్ ఉందని అనేవారట. అలా పోరడంతో ఎంటీయార్ తాను నటించిన క్రిష్ణావతారం సినిమాలో బాల క్రిష్ణుడిగా హరిక్రిష్ణకు వేషం ఇచ్చారు. అది బాగా క్లిక్ కావడంతో మరిన్ని సినిమాలలో ఎంటీయార్ చాన్స్ ఇచ్చారు. అలా అన్న గారి వారసుడిగా హరి అందరి కళ్ళలో మొదట్లోనే పడ్డారు.


ఆ ఫోటో వైరల్ :


ఇక ఆరేళ్ళ వయసులో తండ్రితో పాటే హరిక్రిష్ణ  విరాళాల సేకరణలో పాలుపంచుకున్నారు. . అది 1962లో దేశ రక్షణ నిధి కోసం ఎంటీయార్ మద్రాస్ నుంచి వచ్చి ఆధ్రాలో విరాళాలు సేకరించారు. అలా తండ్రితో కలసి జనంలోకి వచ్చిన హరి ముందు నడుస్తూ విజయవాడలో నాడు తిరిగిన ఓ అరుదైన ఫోటోను సినీ దర్శకుడు క్రిష్ సేకరించి తన ట్విట్టర్ ద్వార పోస్ట్ చేయడం విశేషం. మొత్తానికి బాల  హరి కూడా ఘనాపాటీనే అంటూ వైరల్ అవుతోంది ఆ ఫోటో.


మరింత సమాచారం తెలుసుకోండి: