హరికృష్ణ టీడీపీ లో జరిగి తప్పులను తన బావ అయినా చంద్ర బాబు ను సూటిగా ప్రశ్నించ గల వ్యక్తి. టీడీపీ లో బాబుకు హరికృష్ణ ఎక్కడో భయం ఉందని చెప్పాలసిందే. తన తండ్రి ని కాదని బావకు సపోర్ట్ చేస్తే తనను ఘోరంగా మోసం చేసాడని హరికృష్ణ చాలా లేటుగా గమనించాడు.  ఆగ‌స్టు సంక్షోభంలో తండ్రిని సైతం ఎదురించి బావ‌కు అండ‌గా నిలిస్తే, అవ‌స‌రం తీరాక ప‌క్కన ప‌డేసిన తీరు ఆయ‌న రాజ‌కీయ జీవితంలో చేదు జ్ఞాప‌కంగా మిగిలింది.

Image result for harikrishna

త‌న అజ్ఞానం, అమాయ‌క‌త్వం, కుట్రల‌ను ప‌సిగ‌ట్టలేని మూర్కత్వం సింహం లాంటి తండ్రిని ప‌ద‌వీచ్యుతుడినీ చేయ‌డ‌మే గాక‌, న‌డిరోడ్డుపై చెప్పు దెబ్బల రుచి చూసేలా చేయ‌డం హ‌రికృష్ణను జీవితాంతం పీడ‌క‌ల‌లా వెంటాడుతూ ప‌శ్చాత్త భావ‌న కుమిలిపోయేలా చేసింది. బావ అప్రజాస్వామిక విధానాలు, వంచ‌న‌కు వ్యతిరేకంగా అన్నాటీడీపీని స్థాపించి ఊరూవాడా తిరిగి బాబు  నిజ‌స్వరూపాన్ని ప్రజ‌ల ముందు ఆవిష్కరించారు. ఆ ఎన్నిక‌ల్లో హ‌రికృష్ణ పార్టీ అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకుని ఉండొచ్చు గాక‌... కాని బాబు వక్రబుద్ధిని జ‌నానికి తెలియ జేయ‌డంలో మాత్రం ఆయ‌న విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత కాలంలో ప‌ర‌స్పర అవ‌స‌రాల రీత్యా బావ‌, బామ్మర్ది క‌లుసుకున్నారు.

Image result for harikrishna

తన కుమారుడు ఎన్టీఆర్‌ను టీడీపీ రాజ‌కీయ వార‌సుడిగా ప్రక‌టించాల‌ని ఆయ‌న బాబును కోరారు. దీన్నిబ‌ట్టి హ‌రికృష్ణ ఎంత అమాయ‌కుడో అర్థం చేసుకోవ‌చ్చు. మామ‌ను, తోడ‌ల్లుడిని, బామ్మర్దుల‌ను.. ఇలా అనేక మందిని రాజ‌కీయ జీవితాల‌ను స‌మాధుల‌ను చేసి, వాటి పునాదుల‌పై నిర్మించుకున్నఅధికార సౌధంపై త‌న కొడుకును కాకుండా నంద‌మూరి వార‌సుడిని కూర్చోపెడుతార‌ని హ‌రికృష్ణ ఎలా న‌మ్మారో అర్థంకాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: