పదవులు అన్నవి సాంకేతికం, వాటీ ద్వారా ఎంత పేరు దక్కిందన్నదే కొలమానం. అలా కనుక చూసుకుంటే నందమూరి హరిక్రిష్ణ తెలుగు ప్రజల గుండెల్లొ గొప్ప స్థానమే సంపాదించుకున్నారు. అయన టాప్ సినీ స్టార్ కాదు, ఏళ్ళకు ఏళ్ళు మంత్రిగా పనిచేసిన నాయకుడూ కాదు. కానీ ఆయన మరణంతో ఎందరిని కదిలించాడో,  ప్రజల మనసులలో ఎంతటి ప్రేమను సాధించారో చూస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది.


సందేశం అందించారు :


హరిక్రిష్ణ నందమూరి ఇంట పుట్టారు. పుట్టుకతోనే సంపన్నుడు అన్న మాట. అంతే కాదు ఓ సూపర్ స్టార్ కుమారుడు. ఇపుడు మరో సూపర్ స్టార్ కి తండ్రి. తాను హీరో గా ఓ వెలుగు వెలిగారు. మంత్రిగా కొన్నాళ్ళు పనిచేసారు. ఎంపీ అయ్యారు. తన తమ్ముడు టాప్ హీరో, చెల్లెలు కేంద్ర మంత్రిగా చేశారు. బావ ముఖ్యమంత్రి, అలాగే  మేనల్లుడు లోకేష్ మంత్రి. అయినా ఆయన ఇవేం పట్టించుకోలేదు, తానేంటో తెలుసు అన్నట్లుగానే జీవితమంతా గడిపారు.  ఆయనలో ఇసుమంతైనా గర్వం లేదు. స్వచ్చమైన పల్లెటూరి మంచితనం సొంతం చేసుకున్నారు. పది మందిలో నేనూ అనుకున్నారు కనుకనే ఇపుడు ఆయన లేకపోయినా వేలాదిమంది వెంట నడుస్తున్నారు. 


అసలైన విలువ అదే :


తండ్రి వాహనానికి డ్రైవర్ గా చేయడమే కాదు కంటికి రెప్పలా చూసుకున్నారు. ఇది ఈనాటి యువతకు ఓ సందేశమే. తండ్రి సీఎం గా ఉన్నపుడు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చేస్తే తానేంటో చెప్పకుందా చలాన్ కట్టేశారు, ఇది కూడా ఇప్పటి తరం నేర్చుకోవాల్సిందే. నలుగురుతో మంచిగా ఉంటూ, స్నేహం అంటే ప్రాణం ఇస్తూ ముందుకు సాగిన హరి జీవితం చాల మందికి సందేశం.. ఆయన మంచితనమే ఈ రోజు ఎంతో మందిని పార్ధివ దేహం వెంట నడిచేలా చేసింది. మనిషి బతికి ఉన్నపుడు కాదు, చనిపోయాక వచ్చే స్పందనే అసలైన విలువ. అలా కనుక చూసుకుంటే హరిక్రిష్ణ ధ్యన్యుడు. ఆయన అంతిమ యాత్రను చూస్తే అదే అర్ధమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: