ఉత్తరాంధ్ర వాసుల చిరకా వాంచ, ఆ మాటకు వస్తే ఏపీవ్యాప్తంగా ఉన్న ప్రజల కోరిక ఇకనైనా తీరనుందా. ఇంతకాలం ఆ విషయంలో కుంటిసాకులు చెబుతూ వస్తున్న పాలకులు తెర తొలగించి కీలక ప్రకటన చేస్తారా. రాజకీయ మాయాజాలంతో ఇంకా నమ్మించే ప్రయత్నమే చేస్తారా.. 


రైల్వే కూత ఎంత దూరం :


విశాఖకు రైల్వే జోన్ ప్రకటిస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నట్లుగా ఒడిషా ఎంపీ ఒకరు క్లారిటీ ఇచ్చేసారు. విభజన హామీలపై డిల్లీలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ మీటింగులో ఈ మేరకు బిజూ జనతాదళ్ ఎంపీ ఒకరు తానే వకల్తా పుచ్చుకుని మరీ రైల్వే జోన్ ప్రస్తావన చేయడం విశేషం. ఎపుడు ఇస్తారంటూ గట్టిగా డిమాండ్ కూడా చేశారు. ఈ పరిణామాలు నిజంగా జోన్ ఏర్పాటుకు అనుకూలమైనవే.


ఇంకా పరిశీలిస్తూనే:


మరి ఒడిషా అభ్యంతరాలు చెబుతోందంటూ ఇంతకాలం సాకులు చెప్పిన రైల్వే అధికారులు ఇపుడు ఏం మాట్లాడతారో కానీ స్టాండింగ్ కమిటీ మాత్రం పాత పాటే పాడేసింది. రైల్వే జోన్ విషయం ఇంకా పరిశీలిస్తుమని చెప్పడం అందులో భాగమే. ఎపుడో అయిదేళ్ళ క్రితం నాటి యూపియే సర్కార్ విభజన హామీలలో అగ్ర భాగాన విశాఖ రైల్వే జోన్ పెట్టేసింది. మరి బీజేపీ అధికారంలోకి  వస్తే ఆరు నెలలలో ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చింది. ఇపుడు మరికొద్ది నెలలలో ఎన్నికలు వస్తున్నాయి 


కానీ జోన్ సంగతి మాత్రం తేల్చడం లేదు. ఇకనైనా ప్రకటిస్తారా అని ఏపీవ్యాప్తంగా జనం ఆసక్తిగా ఎదురుచూస్తుననారు. అన్నట్లు ఈ మధ్యనే విశాఖ బీజేపీ నాయకులు కూడా థంక్స్ మీట్ పేరుతో డిల్లీ వెళ్ళొచ్చారు. జోన్ వచ్చేసినట్లేనని సంబరాలు కూడా చేసుకున్నారు. మరి జోన్ సంగటేంతో వాళ్ళే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: