ప్రత్యేక హోదా అన్నది జనానికి సెంటిమెంట్ అయింది. రాజకీయ నాయకులకు మాత్రం ఓటు బ్యాంక్ గా  మారింది. ఎన్నికల ముందు హామీ ఇచ్చి పోయిన సారి  ఓట్ల  పంట పండించుకుని కేంద్రంలో బీజేపీ, ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇపుడు బీజేపీతో విడిపోయి బాబు హోదా అంటున్నారు. మరో వైపు అడ్డగోలు విభజన చేసి ఏపీని చీల్చిన కాంగ్రెస్ హోదా పాట పాడుతోంది. ఇవన్నీ చూస్తున్న జనానికి మాత్రం హోదా వస్తుందన్న నమ్మకం ఏ కోశానా కలగడంలేదు. అందుకే విరక్తితో తరచూ ఆత్మ  బలిదానాలు చేసుకుంటున్నారు.


సెల్ టవర్ కి ఉరేసుకుని ఆత్మ హత్య :


విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత వద్ద ఓ యువకుడు ఆత్మ బలిదాన చేశాడు. ఈ రోజు జరిగిన ఈ విషాద ఘటనలో రాజమండ్రీకి చెందిన త్రినాధ్ అనే యువకుడు రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా  ఇవ్వాలంటూ తన ప్రాణాలను అర్పించాడు. దొడ్డి త్రినాథ్  అనే యువకుడు తాను ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికి పాల్పడినట్టు సూసైడ్ నోట్‌లో రాశాడు. సంఘటన స్థలంలో దొరికిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరిట మృతుడు సూసైడ్ నోట్ రాశాడు. హైద్రాబాద్ అభివృద్ధి విషయంలో చూపిన శ్రద్ధ ప్రత్యేక హోదా విషయంలో చూపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఆ లేఖలో కోరడం గమనార్హం.


వరద బాధికుల కన్నా ఇది పెద్ద సమస్య :


‘అయ్యా.. సీఎం గారు హైదరాబాద్ అభివృద్ధి విషయంలో మీరు చూపించిన శ్రద్ధ, ప్రత్యేక హోదా విషయంలో చూపించండి. అప్పుడే నా మరణానికి ఒక అర్ధం, మా అమ్మ నన్ను కన్నందుకు ఒక ప్రయోజనం, ప్లీజ్ సర్, . కేరళ  వరదల్లో ఉందని అందరూ ముందుకొచ్చి ఆదుకోవాలని తమ సమయాన్ని ధన రూపంలోను, మాటల రూపంలో ఆదుకుంటున్నారు. ముఖ్యంగా మీడియా, సినీ ప్రముఖులు ముందుకొచ్చి సహాయాన్ని అడుగుతున్నారు. ఇది తప్పు అని అనడం లేదు.

 కానీ అంతకన్నా ఎక్కువ వరద బాధితులు సార్ ఏపీ ప్రజలు. దయచేసి గుర్తించండి. ప్రత్యేక హోదా విషయంలో సినీ, రాజకీయ, పారిశ్రామివేతలు ఆదుకోవాలి. మాట తప్పినందుకు అమ్మా నన్ను క్షమించు. అమ్మను జాగ్రత్తగా చంటిపిల్లలా చూసుకోండి’ అంటూ హ్రుదయ విదారకంగా ఆ నోట్ లో త్రినాధ్ పేర్కొన్నారు.


జగన్ సంతాపం :


ప్రత్యేక హోదా కొసం యువకుడు త్రినాథ్‌ ఆత్మ హత్య చేసుకోవడం  పట్ల ప్రతిపక్ష నాయకుడు జగన్ ఆవెదన వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తుతం విశాఖ జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్నారు.  ప్రత్యేక హోదా కోసం ఎలాంటి ప్రాణత్యాగాలకు పాల్పడవద్దని కోరారు. పోరాటాల కోసం ప్రత్యేక హోదా సాధించుకుందామని అన్నారు. త్రినాధ్  కుటుంబ సభ్యులకు జగన్  సానుభూతి తెలిపారు. మొత్తానికి ఈ మధ్యన ఛిత్తురు జిల్లాలో ఇలాగే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాగే ప్రజలు చనిపోతున్నారు కానీ హొదా రావడం లేదు.  మరెన్ని దారుణాలు చూడాలో ఏమిటో. ..!


మరింత సమాచారం తెలుసుకోండి: