మాములుగా అయన ధర్మరాజు. ఎంత సేపు తన ఏరియా, తన ప్రజలు, సమస్యలు అన్నట్లే ఉంటారు. అటువంటి అలుగుటయే ఎరగని ధర్మరాజుకు ఆవేశం మండుకొచ్చింది అంటే అది సునామీయే అంటున్నారు. పార్టీకి కూడా గుడ్ బై కొడతానని ఆయన లేటెస్ట్ గా ఇచ్చిన స్టేట్మెంట్ ఇపుడు హీటెక్కిస్తోంది. ఇంతకీ ఆయన ఆ పార్టీలోకే వెళ్తారా అన్న చర్చ సాగుతోంది.


సొంత పార్టీపైనే  ఫైర్ :


విజయనగరం జిల్లా సాలూర్ ఎమ్మెల్యే రాజన్న దొర సొంత పార్టీ వైసీపీనే  టార్గెట్ చేయడం చర్చనీయాశంగా ఉంది. జిల్లాలో జనం జ్వరాలతో చస్తూంటే మా పార్టీ నాయకులు మొద్దు నిద్ర పోతున్నారంటూ ఆయన చేసిన హాట్ కామెంట్స్ పార్టీకి దెబ్బేనంటున్నారు. ఆయన ఈ కామెంట్స్ ద్వారా ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా ఉంది.


అప్పట్లోనే టాక్ :


చాన్నాళ్ళ క్రితం విశాఖ జిల్లా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీ నుంచి జంప్ అయినపుడే రాజన్న దొర పేరు వినిపించింది. ఆయన కూడా సైకిల్ ఎక్కబోతున్నారంటూ ప్రచారం  నడిచింది. అయితే దానికి వెంటనే ఆయన ఖండించడం, పార్టీ కూడా అలెర్ట్ కావడం జరిగిపోయాయి. మరి ఇపుడు ఎన్నికలు తరుముకు వస్తున్న టైంలో మరో మారు ఎమ్మెల్యే సొంత పార్టీపై ఫైర్ కావడం. ఏకంగా ఎమ్మెల్యే పదవికే కాదు, పార్టీకి రాజీనామా  అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.


జనసేన వైపు చూపు :


సాలూర్ ఎమ్మెల్యే జనసేన వైపు చూస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఆయన టీడీపీని, వైసీపీని కలిపి తిడుతున్నారు అంటే  మరో పార్టీ జనసేన అన్నది క్లారిటీ వస్తోంది. పైగా ఈ మధ్యన జనసెన నాయకులు కొంతమంది ఉత్తరాంధ్ర నుంచి భారీగా వలసలు ఉంటాయని చెప్పుకొచ్చారు. పైగా సాలూరు లో డ్యాం ష్యూర్ గా తాము గెలవబోతున్నామని కూడా ప్రకటించారు. ఇవన్నీ చూస్తుంటే రాజన్న దొర మీద జనసేన కన్ను పడిందని అంటున్నారు.
చాలా సామాన్యుడిగా ఉంటూ జనం కోసం పనిచేసే రాజన్న దొర ని జనసేన వైపు తీసుకువస్తే విజయం గ్యారంటీ అని ఆ పార్టీ భావిస్తోంది. దీనికి తగ్గట్లుగానే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉండడంతో దొర వైసీపీ నుంచి జారిపోతారా అన్న టాక్ నడుస్తోంది. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: