తెలంగాణా ముఖ్య‌మంత్రి కెసిఆర్ అనుకున్న‌వి సాధించుకుంటున్నారు. జిల్లాల సంఖ్య‌ను పెంచాల‌ని అనుకున్నారు. పెంచేశారు. తెలంగాణాలోని కాళేశ్వ‌రం లాంటి పెద్ద ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాల‌నుకున్నారు. అదే ప‌నిలో ఉన్నారు. ఇక మిష‌న్ భ‌గీర‌ధ‌, ఇంటింటికి న‌ల్లా నీరు లాంటి అనేక ప్రాజెక్టుల‌ను పూర్తి చేసుకుపోతున్నారు. కెసిఆర్ ఏమీ ఎన్డీఏలో స‌భ్యుడు కాదు. క‌నీసం బిజెపితో మిత్ర‌ప‌క్షం కూడా కాదు. అయినా కేంద్రంతో మాట్లాడి అనుకున్న వాటికి అనుమ‌తులు తెప్పించుకోగ‌లుగుతున్నారు. ద‌టీజ్ కెసిఆర్. 


రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వులు

Image result for zonal system gagette

తాజాగా తెలంగాణా జోన్ల‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది.  ఈ మేర‌కు గెజిట్ నోటిఫికేష‌న్ కూడా విడుద‌లైంది. ఏడు జోన్ల‌కు, రెండు మ‌ల్టీ జోన్ల‌కు రాష్ట్ర‌ప‌తి ఆమోదం తెలిపారు. మొన్న‌టి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో న‌రేంద్ర‌మోడితో కెసిఆర్ స‌మావేశ‌మైన‌పుడు జోన్ల‌కు అనుమ‌తి విష‌యం ప్ర‌స్తావించారు. వెంటనే కేంద్రం ఆమోదం వ‌చ్చేసింది. నిజానికి 10 జిల్లాల తెలంగాణాను కెసిఆర్ అనాలోచితంగానే 31 జిల్లాల‌కు పెంచారు. అయితే ఆ త‌ర్వాత ఎదురైన స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌టంలో చాక చ‌క్యంతో వ్య‌వ‌హరించ‌టంతో ఇపుడు రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వుల‌కు కూడా ఆమోదం వ‌చ్చేసింది.


ఢిల్లీ వెళ్ళ‌గానే వెలువ‌డిన ఉత్త‌ర్వులు

Related image

తెలంగాణ కొత్త జోన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఏడు జోన్లకు, రెండు మల్టీ జోన్లకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కొత్త జోన్ల ఆమోదం కోసం ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెల్సిందే. రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి, కేంద్ర హోంమంత్రి, ఆర్థిక మంత్రులను కూడా కలిశారు. తెలంగాణ ఏర్పడినప్పటికీ ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న జోనల్‌ వ్యవస్థ అవరోధంగా ఉందని ముఖ్యమంత్రి మొదటి నుంచి భావించారు. దానికి అనుగుణంగా జోనల్‌ వ్యవస్థలో మార్పులకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగంగానే 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణాను 31 జిల్లాలుగా చేసి స్థానికులకు 95 శాతం రిజర్వేషన్‌ అమలు చేయడం వల్ల స్థానిక యువకులు ఎక్కువ అవకాశాలు పొందుతారని సీఎం భావించారు. 


కొత్త జోనల్‌ విధానం ఇదీ

Image result for zonal system gagette

తెలంగాణలో ప్రస్తుతమున్న రెండు జోన్ల స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పడతాయి. అందులో మొదటి నాలుగు జోన్లను ఒక మల్టీజోన్‌గా మిగిలిన మూడు జోన్లను రెండో మల్టీజోన్‌గా పరిగణిస్తారు. మరోవైపు ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువులో వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: