హరికృష్ణ చనిపోవడం తో చంద్ర బాబుకు వ్యతిరేకంగా మాట్లాడే నందమూరి వారసుడు కనిపించడం లేదు. టీడీపీ లో చంద్ర బాబు నాయుడు నిర్ణయాలను వ్యతిరేకించే దమ్మున్న వ్యక్తి ఒక్క హరికృష్ణ మాత్రమే. తనను వెన్నుపోటు పొడిచి పార్టీని హస్తగతం చేసుకుని, నాయకులందర్నీ తనవైపు తిప్పుకున్న చంద్రబాబుని ఆనాడు ఎన్టీఆర్ ప్రశ్నించారు. ఎదురొడ్డి నిలబడ్డారు. అయితే ఆయన మరణంతో చంద్రబాబుకి పార్టీపై పూర్తి ఆధిపత్యం లభించింది.

బాబును ప్రశ్నించే నందమూరి వారసుడు ఎవరు?

నందమూరి కుటుంబంలో అంతా ఆయనకు సాగిలపడ్డారు కానీ హరికృష్ణ మాత్రం నాన్నకి జరిగిన అవమానం తట్టుకోలేక బాబుని ఎదిరించారు. పార్టీ గాడితప్పుతుందనుకుంటే నిర్భయంగా, నిర్మోహమాటంగా చంద్రబాబు నిర్ణయాలను తప్పుపట్టగల ఏకైక నాయకుడు హరికృష్ణే అనే ఇమేజ్ ఆయనకుంది.  ఇక మిగిలింది బాలకృష్ణ. బాలయ్యకు బావయ్యకు వంతపాడటం మినహా ఇంకేమీ చేతకాదని ఎప్పుడో తేలిపోయింది. బావ పక్కన ఉంటేనే ఆయన గొంతు పెగులుతుంది.

Image result for jr ntr and chandra babu

సొంతంగా మాట్లాడాలని ట్రై చేశాడా అది దబిడి దిబిడే. దీనికి చాలానే ఉదాహరణలున్నాయి. పార్టీ సిద్ధాంతాలు, ఎత్తులు, పైఎత్తులు.. బాలయ్య మైండ్ ఇంకా అంత ఎదగలేదు. సో బామ్మర్ది కమ్ వియ్యంకుడితో బాబుకి ఎప్పుడూ ప్రమాదం లేదు. జూనియర్ ఎన్టీఆర్.. టీడీపీని హస్తగతం చేసుకోగల సత్తా ఉన్న ఏకైక నందమూరి వారసుడు. ఎన్టీఆర్ అని అందరూ అంటుంటారు. కానీ చంద్రబాబు ఇప్పటికే ఎన్టీఆర్ ని పూర్తిగా పక్కకు నెట్టేశారు. ఎన్టీఆర్ ప్రచారం అప్పట్లో పార్టీని గట్టెక్కించలేకపోయిందని బాబు వ్యతిరేక ప్రచారం చేసి మరీ జూనియర్ ని సైడ్ చేశారు. నందమూరి వారి టీడీపీ కాస్తా.. ఇక పూర్తిగా నారావారి టీడీపీ అయిపోయింది. చంద్రబాబుని ఎదిరించేవారు, నిలదీసేవారు, పార్టీ నిర్ణయాలను నిర్మొహమాటంగా తప్పుపట్టేవారు నందమూరి కుటుంబంలో ఇప్పుడు ఎవరూలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: