ఆయన అచ్చమైన రధ సారధే. తాను ఎపుడూ రధాన్ని తోలడమే కానీ ఎక్కి కూర్చుని ఆస్వాదించేది లేదు. అయితే ఒకానొక దశలో చోటు చేసుకున్న రాజకీయం పుణ్యమాని ఆ సంబరమూ తీరింది. అయితే అది చాల కొద్ది కాలమే. ఆ ముచ్చటకు ఇపుడు 23 ఏళ్ళు. దాని గురించి నెమరువేసుకునేందుకు సారధి లేడు.  ఆయనకపుడే నూరేళ్ళు నిండిపోయాయి.


హరి మంత్రి అయిన వేళ :


ఇపుడు నడి వయసులో పడిన వారందరికీ రెండు దశాబ్దాల క్రితం ఏపీలో జరిగిన ఓ అతి కీలకమైన రాజకీయ ఘట్టం గుర్తుండే ఉంటుంది. 1995లో నాటి సీఎం అన్న గారిని అకారణంగా గద్దె దించేసి ఆయన అల్లుడు చంద్రబాబు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున వైనం ఇపుడున్న వారిలో సీనియర్లకు బాగా ఎరుకే. అలా దక్కిన అధికారంలో నుంచి మంత్రిగా అన్న గారి కుమారుడు హరిక్రిష్ణను చేశారు బాబు. అది కరెక్ట్ గా ఇదే రోజు. 1995 సెప్టెంబర్ 1న బాబు కొత్త సీఎంగా మంత్రివర్గం ప్రమాణం చేసింది. 


అతి కొద్దికాలం హవా :


ఆ తరువాత ఆరు నెలలు మాత్రమే హరి క్రిష్ణ మంత్రిగా పనిచేశారు. తనకు ఇష్టమైన రవాణా శాఖకు ఆయన మంత్రిగా ఉన్నారు.  ఎమ్మెల్యే కాకపోవడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.  తన తండ్రి ఖాళీ చేసిన హిందుపురం నుంచి ఉప ఎన్నికలో  ఆయన పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత  మళ్ళీ మినిష్టర్ కుర్ఛీ ఎక్కలేదు, మామూలు ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఆ రాజకీయ మంత్రంగమంతా బాబుది. 



ఇదంతా ఎలా ఉన్నా తన తండ్రి సీఎం కావడానికి బావ కుర్చీ ఎక్కడానికి రధ సారధ్యం వహించిన హరి తాను మాత్రం అధికార రధంపై  అట్టే సేపు కూర్చోలేకపోయారు. సెప్టెంబర్ 1న బాబు సీఎం ఫస్ట్ టైం అయి ఈ రోజుకు 23 ఏళ్ళు కావస్తున్న టైంలో నాటి ముచ్చట్లను నెమరువేసుకునేందుకు హరి లేకపోవడం ఓ లోటే మరి. ఇంతకు మూడు రోజుల ముందే ఆయన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం విషాదం.


మరింత సమాచారం తెలుసుకోండి: