నందమూరి తెలుగుదేశం కాస్తా నారా తెలుగుదేశమై నేటికి 23 ఏళ్ళు. అపుడపుడు పార్టీలో నందమూరి చప్పుళ్ళు  కొద్దిగాగానైనా వినిపించాయంటే అది అన్న గారి కొడుకు  హరిక్రిష్ణ సెటైర్లు, హాట్ కామెంట్స్ వల్లనే. బ్యాడ్ లక్ ఆయన ఇపుడు లేకుండా పోయారు. సో  బాదారాయణ బంధమంతా చేరి నారా వారి టీడీపీ మరింతగా బలోపేతమవుతోంది. నారా వారి న్యూ బ్లడ్ పార్టీలోకి వస్తోందట.


సొంత జిల్లా వైపు చూపు :


చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఇపుడు ఎదురుగాలి వీస్తోంది. పోయిన ఎన్నికలలోనే వైసీపీ ఇక్కడ పైచేయిగా ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను  మంత్రులుగా చేసినా సీమ సీన్ ఏం మారలేదు. చిత్తూరులోనూ సేం సీన్ ఉంది. సొంత జిల్లాలో రేపటి రోజున గెలవడంతో పాటు పార్టీలో కొడుకు బలం పెంచడానికన్నట్లుగా చంద్రబాబు కొత్త ప్లాన్ వేస్తున్నట్లు భోగట్టా. అది వర్కవుట్ అయితే తిరుగులేదని అధినేత భావిస్తున్నారు. 


తమ్ముడు కొడుకు ఎంట్రీ :


ఈ నేపధ్యంలో  తమ్ముడు కొడుకుపై బాబు చూపు పడిందని అంటున్నారు. తిరుపతి టూర్లో నిన్న హటాత్తుగా బాబు తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు ఇంటికి వెళ్ళి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. భద్రతా సిబ్బందిని కూడా పక్కన పెట్టి జరిపిన ఏకాంత చర్చలలో తమ్ముడు కొడుకు, సినిమా హీరో నారా రోహిత్ కూడా పాలుపంచుకున్నాడని టాక్. రాజకీయాలే ప్రధానంగా చర్చకు వచ్చాయని అంటున్నారు.


రెడీ టు  జర్నీ :


పొలిటికల్ జర్నీకి నారా రోహిత్ రెడీ అయ్యాడని అంటున్నారు. హీరోగా చాలా  సినిమాలు చేసిన రోహిత్  మంచి పేరే తెచ్చుకున్నారు. ముఖ్యంగా సోషల్ మెసేజ్ మూవీస్ ఆయన చేశారు. ఇపుడు పెదనాన్న దర్శకత్వంలో రాజకీయ సినిమా చేయాలని డిసైడ్ అయినట్లుగా టాక్. అన్నీ కుదిరితే వచ్చే ఎన్నికల్లో సొంత జిల్లా నుంచి తన టీడీపీ తరఫున రోహిత్ పోటీ ఖాయమని అంటున్నారు. రోహిత్ లోకెష్ కి తమ్ముడవుతారు. రేపటి రోజున టీడీపీలో నారా వారి హవాకు రోహిత్  జత అవుతాడన్న మాట. అలా నారా వంశంతో టీడీపీ మరింత బలోపేతం కానుందని టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: