చంద్రబాబు పెళ్ళిళ్ళ భాగోతాన్ని ఊరూరా తిరిగి జగన్ దరువేస్తూంటే  భారీ రెస్పాన్స్ వస్తోంది. బాబు  రాజకీయ పొత్తులను పెళ్ళెళ్ళూ విడాకులతో పోల్చడంతో గ్రామీణులు బాగానే కనెక్ట్ అవుతున్నారు. తన కామెంట్స్ కి  జగన్   పంచ్ డైలాగులతో మసలా దట్టిస్తూంటే బాగానే పేలుతున్నాయి. బాబు  రాజకీయాన్ని ఇలా బట్టబయలు చేయడానికి జగన్ ఎంచుకున్న పెళ్ళిళ్ళూ, సంసారాలూ డైలాగులకు ఓ రేంజిలో స్పందన వస్తోంది.


మొదటి పెళ్ళాం చెడ్డది :


బీజేపీతో పొత్తు పెట్టుకుని నాలుగున్నరేళ్ళు సంసారం చేసిన తరువాత బాబుకు మొదటి పెళ్ళాం బీజేపీ చెడ్డదని గుర్తుకువచ్చిందని జగన్ సెటైర్లు వేశారు. వెంటనే విడాకులు ఇచ్చేశాడని, సరేననుకుంటే ఇపుడు రెండవ పెళ్లాం కావాలంటూ పరుగులు తీస్తున్నడని జగన్ మాటలతో అటాక్ చేశారు. ఆ రెండవ పెళ్ళాం ఎవరనుకున్నారు, రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చేసిన కాంగ్రెస్ అని జగన్ రెండు పార్టీలకు ఝలక్ ఇచ్చేలా కామెంట్స్ చేశారు. ఈ రోజు చోడవరంలో జగన్ పాదయత్ర సందర్భంగా జరిగిన మీటింగుకు జనం పోటెత్తారు.


అంగుళం అంగుళం మింగేశారు :


విశాఖ జిల్లాలో భూములను టీడీపీ నాయకులు అంగుళం అంగుళం మింగేశారంటూ జగన్ ఆరోపించారు. వందల ఎకరలాను కోట్ల రూపాయల భూములను కబ్జా చేసేసి జనానికి టోపీ పెట్టారని విరుచుకుపడ్డారు. భూబకాసురులు ఇలా రెచ్చిపోతూంటే బాబు వారికి అండగా ఉంటున్నారని మండిపడ్డారు.  బాబు వస్తే జాబ్ రాలేదని బాధలు, ధరల బాదుడూ  మాత్రం వచ్చాయని జగన్ సెటైర్లు వేశారు.


యనమల సింగపూర్ వెళ్తారు :


బాబు గారి మంత్రి తన పన్ను నొప్పికి సింగపూర్ వెళ్ళి వైద్యం తీసుకుంటారని, ఏపీలో పేదవాడు హైదరాబాద్ వెళ్ళి వైద్యం చేసుకోవడానికి మాత్రం బాబు గారి ఆరోగ్యశ్రీ ఒప్పుకోదని జగన్ కౌంటర్లేశారు. ఇసుక నుంచి భూముల వరకు సర్వం అవినీతిమయం చేసిన టీడీపీ పాలనలో ధర్మమే లేదని అన్నారు. మరో వైపు ధర్మ పోరాట దీక్షలని బాబు డ్రామాలు ఆడుతున్నారన ని దుయ్యబెట్టారు. 


అపుడే చేస్తే :


బాబు ప్రత్యేక హోదాపై మూడేళ్ళ క్రితమే మోడీని నిలదీసి ఉంటే నిన్నటి రోజున త్రినాధ్ అనే యువకుడి ఆత్మహత్య జరిగి ఉండేదా అని జగన్ ప్రశ్నించారు. ఎంతో మంది యువకులు బలిదానం చేసుకున్న బాబు సర్కార్ కు  పట్టడం లేదని, ఎన్నికల ముందు మాత్రం కొత్త సినిమాలు చూపిస్తూ ఒట్ల కోసం జనంలోకి వస్తున్నారని ఘాటుగా విమర్శించారు.  మొత్తానికి చోడవరం సభ సూపర్ హిట్ కావడంతో వైసీపీ వర్గాలు హుషార్ గా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: