ఆయన రాజకీయాలలో దమ్మున్న రాజుగారు. కాంగ్రెస్ లో ఉన్న టైంలో హుషార్ గానే ఉండేవారు, టికెట్ మాత్రం అలా చేయి జారిపోతూండేది. అయినా జనం బలం మాత్రం ఆయన సొంతం, లక్కు కలసి రాలేదు కానీ ఆయన ఏనాడో ఎమ్మెల్యే అవాల్సిందంటారు అనుచరులు.  ఇన్నాళ్ళకు కరెక్ట్ పార్టీ కరెక్ట్ లీడర్ కి దొరికిందంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.


బీజేపీకి ఝలక్ :


మూలిగే నక్క మీద తాటిపండు అన్నట్లు అసలే క్యాడరూ లేక, లీడరూ లేక డల్ గా ఉన్న బీజేపీకి మరో ఝలక్ ఇది. ఆ పార్టీకి విజయనగరం జిల్లాలో గట్టి నాయకుడు ఒకరు చెక్ చెబుతున్నారు. ఆయన పార్టీ మారుతున్నారు. శ్రుంగవరంపుకోట అసెంబ్లీ బీజేపీ ఇంచార్జ్ ఇందుకూరి రఘురాజు వైసీపీలోకి చేరబొతున్నారు. కాంగ్రెస్ టికెట్ దక్కనపుడు కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచిన చరిత్ర రాజు గారిది.
ఇక విభజన టైంలో ఏపీలో కాంగ్రెస్ కి ఎక్కడా డిపాజిట్లు రాకపోయినా ఆయనకు మాత్రం అక్కడ డిపాజిట్ దక్కడమే కాదు బాగానే ఓట్లు వచ్చాయి. ఆ తరువాత ఆయన బీజేపీ పిలుపు మేరకు ఆ పార్టీలో చేరిపోయారు.


గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్ 


వైసీపీలో చేరేందుకు రాజు గారు ఈ మధ్యనే విశాఖ జిల్లలో పాదయాత్రలో ఉన్న జగన్ ని కలిశారు. జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తన రాజకీయ గురువు, విజయనగరం జిల్లాలో వైసీపీ పెద్ద దిక్కు అయిన సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణతో కలసి మంచి రోజు చూసుకుని వైసీపీలో రాజు గారు చేరుతారని టాక్. మొత్తానికి రాజు గారు చేరికతో ఎస్ కోటలో వైసీపీ పాగా వేసినట్లేనంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: