చిన్ని క్రిష్ణుడు జగన్నాయకుడు. సర్వ లోకాలకు గురువు. గీత మార్చడానికి, గీత చెప్పిన దేవదేవుడు. ఆయన లీలలు ఎవరికీ అందనివి. సమస్త ప్రపంచాన్ని తనలోనే నిక్షిప్తం చేసుకున్న జగన్నాటక సూత్రధారి. మన్ను తిన్నా, వెన్న దొంగిలించినా కన్నయ్య తత్వం ఏంటన్నది కనిపెట్టలేం. ఒక్క భారతదేశానికే కాదు. మొత్తం ప్రపంచానికే భగవద్గీతను అందించిన క్రిష్ణుడిని చాల దేశాలు అనుసరిస్తాయి. స్మరిస్తాయి.


నాణెం విడుదల చేసిన ఆఫ్రికా  :


ఈ రోజు శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని మధ్య ఆఫ్రికా దేశం ‘రిపబ్లిక్ ఆఫ్ ఛాద్’ 3డి కొలతల ఆకృతి కలిగిన 99.99 స్వచ్ఛత కలిగిన వెండి నాణేలను విడుదల చేసింది. ఆ నాణేలను మన ఆంధ్ర ప్రదేశ్ లోని  ముమ్మిడివరానికి చెందిన ఎస్‌బీఐ ఉద్యోగి యువటూరి రవి సుబ్రహ్మణ్యం, అమలాపురానికి చెందిన పుత్సా కృష్ణకామేశ్వరావు కైవసం చేసుకున్నారు. అవి తమకు  పోస్టులో అందాయన్నారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని శ్రీకృష్ణుడు రావి ఆకుపై నిద్రిస్తున్నట్లుగా ముద్రించిన కృష్ణుని 3డీ నాణేం విశేషంగా ఆకట్టుకుటోంది. 


కన్నయ్య కరుణించాడు :


వంద గ్రాముల వెండితో ప్రపంచ వ్యాప్తంగా 501 నాణేలు మాత్రమే తయారుచేయగా వాటిల్లో రెండు నాణేలను సుబ్రహ్మణ్యం, కృష్ణకామేశ్వరులు ప్రత్యేక అర్డర్‌తో రప్పించారు. వెదురుతో చేసిన ప్రత్యేక బుట్టలో గుడ్డ సంచిలో ఈ నాణెంతో పాటు దాని విశిష్టతను తెలిపే పత్రం కూడా పంపించడం విశేషం. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నాణేలు తమకు చేరడం ఆనందంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  మొత్తానికి క్రిష్ణ సందేశం ఏ దేశమైనా అనుసరిస్తుందని చెప్పడానికి ఈ నాణేల రూపకల్పన ఓ ఉదాహరణ మాత్రమే.


మరింత సమాచారం తెలుసుకోండి: