చంద్ర‌బాబునాయుడుకు  మాజీ ఎంపి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ స‌వాలు విసిరారు. చేసిన రూ. 1.30 ల‌క్ష‌ల కోట్లను రాష్ట్రంలో దేనికి ఖ‌ర్చు  చేశారో చెప్ప‌గ‌ల‌రా ? అంటూ స‌వాలు విసిరారు.  ప్ర‌భుత్వం వేరు వ్యాపారం వేరంటూనే చంద్ర‌బాబు మాత్రం ప్ర‌భుత్వంతో  వ్యాపారం చేస్తున్నార‌ట‌. చంద్రబాబు నిజాలు చెప్పి ప‌రిపాల‌న చేయ‌గ‌ల‌రా అంటూ స‌వాలు విస‌ర‌టం విచిత్రంగానే ఉంది. ఎందుకంటే, చంద్ర‌బాబు నైజం గురించి ఉండ‌వ‌ల్లికి కొత్త‌గా ఎవ‌రో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఏదో శాపం ఉన్న‌ట్లుగా చంద్ర‌బాబు ఏనాడూ నిజం చెప్పర‌న్న విష‌యం ఉండ‌వ‌ల్లికి బాగా తెలుసు. 


9 నెల‌ల ఖ‌ర్చు బ‌య‌ట‌పెట్టాల‌ట‌


చంద్ర‌బాబు చేస్తున్న వ్యాపారాన్ని స్విట్జ‌ర్లాండ్ ఆర్దిక వేత్త‌లు కూడా వ్య‌తిరేకిస్తున్న విష‌యం బ‌య‌ట‌పెట్టారు. గ‌తంలో స్టిట్జ‌ర్లాండ్ మంత్రి చంద్ర‌బాబుపై చేసిన కామెంట్ దుమారం రేపిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.  ప్ర‌భుత్వం ప్ర‌తీ వారం చేస్తున్న ఖ‌ర్చుల‌ను లేదా క‌నీసం గ‌త 9 నెల‌ల ఖ‌ర్చులైనా చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్టాలంటూ ఉండ‌వ‌ల్లి డిమాండ్ చేశారు. అవినీతి చేసి డ‌బ్బులివ్వాల్సొస్తోంద‌న్న విష‌యాన్ని నంద్యాల ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా చంద్ర‌బాబే ఒప్పుకున్న‌ట్లు ఉండ‌వ‌ల్లి చెప్పారు. 


మ‌ద్యం వ్యాపారంపై ఉండ‌వ‌ల్లి కామెంట్

Image result for ap excise department logo

విచిత్ర‌మేమిటంటే ఎప్పుడూ రాజ‌కీయాలు, ప్రాజెక్టుల‌పై మాట్టాడే ఉండ‌వ‌ల్లి తాజాగా మద్యం వ్యాపారంపైన కూడా మాట్లాడారు. రూ. 8.50కి త‌యార‌య్యే మ‌ద్యాన్ని ప్ర‌భుత్వం రూ. 50కి అమ్ముకుంటు 37 రూపాయ‌ల లాభం సంపాదిస్తోంద‌న్నారు. ఇదేదో చంద్ర‌బాబుతోనే మొద‌లైన‌ట్లు ఉండ‌వ‌ల్లి చెప్ప‌టం ఆశ్చ‌ర్యంగా ఉంద‌. ఏ ప్ర‌భుత్వమైనా చేసేదిదే. కాక‌పోతే లాభాలు కాస్త అటు ఇటుగా ఉంటుందంతే. అమ‌రావ‌తి బాండ్ల జారీపైన కూడా అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. ట్యాక్స్ ఎంతో తెలీకుండానే బాండ్లు ఎలా జారీ చేస్తారంటూ నిల‌దీశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: