అపుడెపుడో బాబు రెండవమారు సీఎం అయినపుడు విజన్ 2020 అంటూ రోజూ ఊదరగొట్టేవారు. దానికి సూత్రధారి, రూపకర్త ఇపుడు కటకటాల వెనక ఊచలు లెక్కబెడుతున్నారట. అంతటి విజన్ ఇచ్చిన ఆయనను నెత్తిన బెట్టుకుని తానే రెండు దశాబ్దాల వరకూ ఉమ్మడి ఏపీ సీఎం గా ఉంటానంటూ బాబు ఆ రోజులలో ఓ రేంజిలో చేసిన హడావుడి గుర్తుండే ఉంటుంది.  మరి ఆయన గారి విజవ్ ని అప్పట్లో జనం నమ్మలేదు కానీ లేకపోతే ఏమయ్యేదో ఏమో కదా !


బాంబు పేల్చిన ఉండవల్లి :


చంద్రబాబు పాలనలో డొల్లతనాన్ని, ప్రచార యావను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రోజు  మీడియా మీట్లో ఎండగట్టేశారు.  మీ  పాలన వెనక ఉన్న సలహాదారులు ఇపుడెక్కర ఉన్నారో గుర్తు తెచ్చుకోండంటూ బాంబు పేల్చారు.  అప్పట్లో విజన్ 2020 రూపొందించిన చంద్రబాబు సలహాదారు పాస్కల్ ప్రస్తుతం స్విట్జర్లాండ్ జైలులో ఉన్నారని, ఇలాంటి వాళ్ళను నమ్ముకుంటే పాలన సాగినట్లేనని సెటైర్లు వేశారు. 


ఏపీ అప్పుల కుప్ప :


ఏపీని సర్వనాశనం చేస్తున్నారంటూ బాబుపై మండిపడ్డారు. అప్పుల కుప్పగా చేశారని ఉండవల్లి ఘాట్ కామెంట్స్ చేశారు. బాండ్ల ద్వారా తీసుకున్న .2వేల కోట్ల రూపాయల అప్పుకు ప్రతి మూడు నెలలకు 10.36 శాతం అధిక వడ్డీ చెల్లించాలన్నారు. అమరావతి బాండ్లలో బ్రోకర్‌కు రూ.17 కోట్లు ఇవ్వడమే చంద్రబాబు చెబుతున్న పారదర్శకతా అని ఆయన ప్రశ్నించారు. దమ్ముంటే బాండ్లు కొన్న 9 మంది పేర్లు ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 

అధిక వడ్డీకి అప్పులు తీసుకోవద్దంటూ 7 నెలల క్రితమే జీవో జారీ చేశారని  కూడా  ఉండవల్లి గుర్తు చేశారు. నాలుగేళ్లలో తీసుకున్న రూ.1.30లక్షల కోట్ల అప్పును ప్రభుత్వం ఏం చేసిందని ఆయన  నిలదీశారు. మొత్తానికి ఉండవల్లి తన ప్రశ్నలతో బాబు సర్కార్ కి చుక్కలే చూపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: