పవన్ కళ్యాణ్.. ఆయనంటే ఎల్లలు ఎరుగని అభిమానం. సెలిబ్రిటీస్ కూడా పవన్ అంటే అంతే అభిమానంతో ఉంటారు. ఇక సామాన్యులకు ఆయన ఓ దేవుడు. పవన్ ఏం చేసినా వారికి ఇష్టం. తెరపైన హీరోగానే కాదు, పవన్ వ్యక్తిత్వం చాలమందికి ఇష్టంగా ఉంటోంది. ఆయన నిరాడంబరత చూసి ఆరాధించేవళ్ళు కో కొల్లలు. పవన్ అంటే ఎంత అభిమానమ‌ని అడిగితే ప్రతి ఫ్యాన్ చెప్పే మాట ఒక్కటే.. చచ్చేటంత ఇష్టమని.


అదే చేశాడు :


విజయవాడలో అనిల్ కుమార్ అనే జిమ్ ట్రైనర్ పవన్ కోసం  ఆత్మహత్య చేసుకున్నాడు. హీరోపై పెంచుకున్న విపరీతమైన అభిమానం ఆ యువకుడిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది. విజయవాడ పెన్‌జోన్‌పేటలో నివాసం ఉంటున్న అనిల్ కుమార్‌కు పవన్ అంటే విపరీతమైన అభిమానం. జనసేన చేపట్టిన అనేక కార్యక్రమాల్లో అనిల్ పాలుపంచుకునేవాడు. కానీ ఇటీవల కాలంలో జనసేనకు తాను ఏమీ చేయలేకపోతున్నానని బాధపడేవాడు. అదే విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పేవాడు. జనసేన కోసం ఏదో ఒకటి చేస్తానని చెబుతుండేవాడు.


పవన్ రావాలని :


 
నిన్న (సోమవారం) ఇంట్లో ఉన్నవారందరూ బయటకు వెళ్లిన సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్ కల్యాణ్ తన అంత్యక్రియల్లో పాల్గొనాలని అనిల్ తన చివరి కోరికగా సూసైడ్ నోట్‌లో రాశాడు. తన అభిమాన హీరో, అన్నయ్య కుటుంబసభ్యుడు పవన్ కల్యాణ్ అంటూ లేఖలో ప్రస్తావిస్తూ తన ఆత్మకు శాంతి చేకూరాలంటే తనను చూసేందుకు పవన్ రావాలని, ఆయన చేతుల మీదుగానే అంత్యక్రియలు నిర్వహించాలని లేఖలో కోరాడు.


కుటుంబాన్ని మోసం చేసి :


నిజానికి అనిల్ కుమర్  ది పేద కుటుంబం పవన్ మ్యానియాతో కుటుంబాన్ని మోసం చేశాడు. ఇంటికి ఆసరాగా ఉంటాడనుకున్న వారికి వేదన మిగిల్చాడు. పవన్ కళ్యాణ్ ఇది ఎప్పటికీ కోరుకోరు. ఆ సంగతి అభిమానులు గుర్తించాలి. ప్రాణాలు ఇచ్చే ప్రేమ కాదు. కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటూ తనని ఇష్టపడే ప్రేమను పవన్ ఇష్టపడతారు. అది మిగిలిన ఫ్యాన్స్ కూడ అర్ధం చేసుకుని ఇంకనైనా ప్రాణం ఇచ్చే పిచ్చి ప్రేమను వదిలి ఉత్తమ పౌరులుగా సమాజానికి సేవ చేయాలి. ఈ ఆత్మ హత్య ఎవరికీ ప్రెరణ కారాదు. అదే అందరూ కోరుకునేది. 


మరింత సమాచారం తెలుసుకోండి: