తెలంగాణ లో టీడీపీ పరిస్థితి ఏంటో ఇప్పటికే చంద్ర బాబు కు కూడా తెలుసు. అందుకే తెలంగాణ ఎన్నికల గురించి పెద్దగా మాట్లాడడు. అయితే చిన బాబు తెలంగాణ ఎన్నికల కు సిద్ధమని ప్రకటించాడు.  వెనుకటికి చంద్రబాబు నాయుడు పార్టీ తెలంగాణ వ్యవహారాలను లోకేష్ కు అప్పగించినట్టుగా గుర్తు. ఆ తర్వాతే తెలంగాణలో పార్టీ శూన్యం అయ్యింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో లోకేష్ బాబు హైదరాబాద్ లో చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీకావు. వాళ్ల తాత హైదరాబాద్ లోనే రగుతాతా అని అప్పట్లో లోకేష్ ప్రకటించుకున్నాడు.

Image result for lokesh
అయితే జీహెచ్ఎంసీలో తెలుగుదేశం పార్టీ దారుణాతి దారుణ పరాజయాన్ని మిగుల్చుకుంది. పార్టీని నంబర్ వన్ పొజిషన్లో నిలుపుతా అని ఎన్నికల ముందు ప్రకటిస్తే అంతా ఏమో అనుకున్నారు కానీ.. కేవలం ఒక్క డివిజన్లో మాత్రమే తెలుగుదేశం గెలిచి.. ఎలాగోలా ‘వన్’ అనిపించుకుంది. ఇక ఇప్పుడు తెలంగాణ ఎన్నికలకు రెడీ అని లోకేష్ ప్రకటించాడు.

Image result for lokesh

పొత్తులు ఉంటాయని.. అనీ అన్నాడు... అన్ని స్థానాల్లో పోటీ చేస్తామనీ అన్నాడు. దటీజ్ లోకేష్ బాబు. మరి ఇవన్నీ ఓకే కానీ.. తెలంగాణలో ఎలాగూ ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి కదా, వాటిల్లో లోకేష్ పోటీ చేస్తాడా? పార్టీలో స్ఫూర్తి నింపడానికి తెలంగాణలో పార్టీ బాధ్యతలు స్వీకరించి ప్రత్యక్ష పోటీకి సై అంటాడా? ఏపీ నుంచి తనకు దక్కిన మంత్రి పదవికి రాజీనామా చేసి.. తెలంగాణ ముందస్తు ఎన్నికల కదనరంగంలోకి దూకి.. ఎక్కడో ఒక చోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి.. తెలంగాణకు ముఖ్యమంత్రి అయిపోవచ్చు కదా. అంత ధైర్యం ప్రస్తుతానికి చిన బాబుకు లేదని చెప్పాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: