రాజకీయ పార్టీలకు సభలే  ఊపిరి. ఎన్ని మాధ్యమాలు ఉన్నా, ఎంతగా సాంకేతికత అభివ్రుధ్ధి చెందినా మీటింగులూ, మైకుల మైకం మాత్రం ఎప్పటికీ వన్నె తగ్గనిదే. ఆ కిక్కే వేరబ్బా అన్నట్లు ఉంటుంది భారీ సభ సక్సెస్ అయితే. మొన్నటికి తెలంగాణా కేసీయార్ చేసిందదే. ఇపుడు ఏపీలో ఓ మీటింగ్ ఓ రేంజిలో మీటింగ్ పెట్టాలని ఆ పార్టీ ఉబలాటపడుతోంది.


అదిరిపోయే మీటింగ్ :


విశాఖ నడిబొడ్డున లక్ష మందితో అదిరిపోయే మీటింగ్ పెట్టాలని వైసీపీ డిసైడ్ అయింది. ఆ పార్టీ అధినేత జగన్ పాదయాత్ర ఇపుడు సిటీలోకి ఎంటరైపోయింది. సివారు ప్రాంతాలను నాలుగు రోజుల పాటు చుట్టుముట్టేసి సిటీ మధ్యకు జగన్ వచ్చే వేళకు ఓ భారీ మీటింగ్ పెట్టాలని ఆ పార్టీ ఆలోచిస్తోంది.  ఈ నెల 9న మీటింగ్ జరపాలనుకుంటున్నారు.  మీటింగ్ అలా ఇలా ఉండకుండా పవర్లో ఉన్న పార్టీ ఉలిక్కిపడేలా జరపాలని పార్టీ ప్లాన్ వేస్తోంది.


జిల్లా మాదే :


ఇక విశాఖ సిటీలో 2014 ఎన్నికలలో ఒక్క సీటూ వైసీపీ గెలుచుకోలేదు. పైగా జగన్ తల్లి  విజయమ్మ పరాజయం పాలయ్యారు. దీంతో కసిగా విశాఖపైనే ఆ పార్టీ గురి పెట్టింది. ఈసారి ఎట్టి పరిస్తితులలోనూ విశాఖ సిటీ, జిలాలో కలుపుకుని మొత్తం 15కి 15 సీట్లూ గెలిచేస్తామని ఆ పార్టీ అంటోంది. జనాదరణ ఆ రేంజిలో ఉందని కూడా ధీమాగా చెబుతోంది.


వైఎస్సార్ కంటే కూడా :


అప్పట్లో అంటే 2004 ఎన్నికల్లో మొత్తం జిల్లాలో 12 సీట్లను వైఎస్సార్ నాయకత్వంలో గెలుచుకున్నారు. దానిని తిరగరాసేలా ఈ మాటు 15 సీట్లనూ గెలుచుకుంటామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గట్టిగ చెబుతున్నారు.టీడీపీకి ప్రజా వ్యతిరేకత వెల్లువలా ఉందని, అందులోనే ఆ పార్టీ కొట్టుకుపోతుందని కూడా చెబుతున్నారు. మొత్తానికి జగన్ భారీ సభ విశాఖలో జరగనుంది. మరి టీడీపీ కంచుకోటలో ఆ రీసౌండింగ్ ఎలా ఉంటుందో అ చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: