రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ప్రజలు, సమస్యలు కంటే కూడా వ్యక్తిగత విరోధాలు, ద్వేషాలకే పెద్ద పీట వేస్తున్నారనిపిస్తోంది. దీనికి అచ్చమైన ఉదాహరణ రాష్ట్ర రాజకీయాలే. ఏపీలో అధికార తెలుగుదేశం, విపక్ష వైసీపీల మధ్య రిలేషన్స్ ఉప్పూ, నిప్పులా ఉన్నాయి. దాంతో ఈ రెండు పార్టీలూ ఏ రకంగానూ కలసి చర్చలు జరిపే అవకాశం  కనిపించడంలేదు.


మళ్ళీ డుమ్మా :


గత ఏడాదిగా అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తూ వస్తున్న వైసీపీ ఈ దఫా కూడా డుమ్మా కొట్టాలని దాదాపుగా డిసైడ్ అయిపోయింది. ఆ పార్టీకి చెందిన కడప ఎమ్మెల్యేలు శ్రీకంత్ రెడ్డి, రాచ‌మల్లు ప్రసాద రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా ఇదే చెప్పారు. అసెంబ్లీకి వెళ్తే  ఏం లాభమని వారు ప్రశ్నించారు. అక్కడ తమకు మైకు ఇవ్వరని, తమ ప్రశ్నలకు జవాబులు చెప్పరు కదా, ఎదురు దాడులకు దిగుతారంటూ ఫైర్ అయ్యారు. అందువల్ల తాము వెళ్ళినా, వెళ్ళకపోయినా ఒక్కటేనని అంటున్నారు.


రాకపోవడమే బెటర్ :


తెలుగుదేశం పార్టీకి వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోవడమే  బాగుంటుందట. ఆ పార్టీ మంత్రి, సీఎం సుపుత్రుడు లోకేష్ బాబు ఇదే చెప్పారు. వారు వచ్చినా అరుపులు, కేకలు తప్ప మరేం లేదని సింపుల్ గా తేల్చేశారు. మరో వైపు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట రావు మాట్లాడుతూ, వైసీపీ తీరు ప్రజస్వామ్యానికి గొడ్డలి పెట్టు అంటూ పెద్ద మాటలే వాడారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి  రాకపోవడం విడ్డూరం అంటూనే వాళ్ళు అలా ఉండడమే మంచిదనెశారు.


అదే స్టాండ్ :


మొత్తానికి చూసుకుంటే జగన్ అదే స్టాండ్ మీద ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసిన టీడీపీ వారిని పక్కన పెడితేనే తాము వస్తామని జగన్ అంటున్నారు. టీడీపీ ఆ పని ఎలాగూ చేయదు. సో. వైసీపీ బాయ్ కాట్ అలాగే సాగుతుందన్న మాట. విపక్షాలు ఎన్న్ని విమర్శలు చేసినా జగన్ మాత్రం అసెంబ్లీ బాయ్ కాట్ డెసిషన్ మీద స్ట్రాంగ్ గానే నిలబడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: