కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు మోడీ ని ఒప్పించాడు అయితే ఇందులో లోపాయికారి ఒప్పందం జరిగిందని చాలా మంది ఆరోపిస్తున్నారు ముఖ్యంగా బీజేపీ నేతలే ఈ ఆరోపణలు చేయడం గమన్హారం. అయితే మోడీ కేసీఆర్ వలలో చిక్కుకున్నాడని బీజేపీ నేతలు భయపడుతున్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఆలోచనకు సహకరించడం ద్వారా మోడీ.. తెలంగాణలో పార్టీ అభివృద్ధికి గోతిని తవ్వినట్లుగా వాతావరణం తయారైందని వ్యాఖ్యానిస్తున్నారు.

Image result for kcr and modi

ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో ఎన్నికలకు సన్నద్ధంగా లేవని.. ఈ పరిస్థితిని ఎడ్వాంటేజీగా మార్చుకుని నెగ్గడానికి కేసీఆర్ వ్యూహరచన చేశారని.. సార్వత్రిక ఎన్నికలు ఇంకా అతి తక్కువ వ్యవధిలోనే ఉండగా.. ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం సహకరిస్తున్నదని వారి అభిప్రాయం. ఆ రకంగా చూసినప్పుడు.. ముందస్తు వలన... భాజపాకు కూడా రాష్ట్రంలో గతంలో కంటె ఎక్కువ నష్టం జరుగుతుందనేది భావన.

Image result for kcr and modi

కేసీఆర్ ఈ ముందస్తు ఎన్నికల ద్వారా రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుని... వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు సహకరిస్తానని చెప్పడం వల్లనే.. మోడీ సర్కార్ ఈ ముందస్తు వ్యూహానికి లోపాయికారీగా సహకరిస్తోందనే వాదన పలువురిలో ఉంది. సరిగ్గా ఈ విషయంలోనే తెలంగాణ భాజపా నాయకులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గతంలో తెరాసను విలీనం చేస్తా అంటూ సోనియాకు బిస్కట్ వేశారని, దానికి పడిపోయి చివరి నిమిషంలో రాష్ట్రం ప్రకటిస్తే.. తర్వాత బురిడీ కొట్టించారని అంటున్నారు. అదే క్రమంలో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో మద్దతిస్తా అంటూ మోడీకి బిస్కట్ వేశారని.. మోడీ కూడా అలా కేసీఆర్ మాయలో పడిపోయారని విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: