ప్రెజెంట్ పాలిట్రిక్స్ కు కేసీఅర్ మోడల్ అవుతున్నారా. పాతకాలం వాసనలకు చెక్ పెడుతున్నారా అంతే అవుననే ఆన్సర్ వస్తుంది. ఒకే రోజు ఇన్ని నిర్ణయాలా. అది మెదడా లేక వేయి మెదళ్ళ కర్మాగారమా. రాజకీయాలలో ఒక డిసిషన్ తీసుకోవాలంటేనే యుగాలు, జగాలు చేస్తున్న నేతలు దేశమంతా ఉన్నారు. అదంతా ఓల్డ్ అంటూ తనదైన స్టైల్ ను ఇపుడు కేసీయర్ ముందుకు తెచ్చేశారు.


ఒక్క రోజు..ఎన్నో షాకులు :


ఓ వైపు అసెంబ్లీ రద్దు. ఈ షాక్ నుంచి తేరుకోకుండానే క్యాండిడేట్ల అనౌస్మెంట్. ఆ వెంటనే ప్రెస్ మీట్లూ, ఆ పై వందల సభలు, ప్రతిపక్షం ఆలోచించే లోగానే కేసీయార్ చాలా దూరం వెళ్ళిపోయారు. ఎన్నికలు ఎపుడు వస్తాయి, రిజల్ట్స్ ఎపుడు, ఇలా అన్నీ తానై ప్రకటించేస్తూంటే దేశానికి కొత్త రాజకీయం మప్పినట్లవుతోంది కదా. అదే మరి కేసీయర్ ట్రెండ్ పాలిట్రిక్స్. విపక నేతలు గుక్క తిప్పుకోలేని షాక్ ఇది మరి.


పక్కాగా ప్లాన్ :


గెలిచేయడానికే ఎత్తులు. అవన్నీ కేసీయార్ దగ్గరే ఉన్నాయిపుడు. మరో మూడు నెలలలో మళ్ళీ సీఎం సీటులో కూర్చోవడానికి సరిపడా వ్యూహాన్ని కేసీయార్ ఎపుడో తయారు చేసుకున్నారు. ఇపుడది రాజకీయ తెరపై చూపించడమే తరువాయి. ఉత్తరాదిన ఇపుడిపుడే కాంగ్రెస్ కి కొంత ఆశ కనిపిస్తోంది. నాలుగు రాష్ట్రాలలో జరిగే ఎన్నికలలో ఆ పార్టీ గెలిస్తే చాలు, రేపటి లోక్ సభపై ఆ ప్రభావం బాగానే ఉంటుంది.



 అది పసిగట్టిన కేసీయార్ వడివడిగా అడుగులు వేశారు. అంతే వేగంగా పవులు కదిపారు. ఇపుడు ఎన్నికలు పెడితే టీయారెస్ కి బాగా చాన్స్ ఉంది. అదే కేసీయార్ ధీమా. అందుకే పక్కాగా గెలుపు అనుకునే రెడీ అంటున్నారు. నిజంగా దేశంలో ఇది న్యూ ట్రెండ్ పాలిటిక్సే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: