కేసీఆర్ ముందస్తు ఎన్నికలు జరిపించడానికి కారణాలు చాలా మంది చాలా రకాలుగా చెబుతారు. సహజంగా ఇది కూడా రాజకీయ నిర్ణయమే అని అంతా అనుకుంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి కేంద్రంలో చక్రంతిప్పుతూ ఉండాలనే కోరికతో ఉన్న కేసీఆర్, అందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరుపుతున్నారనేది ఒక ప్రచారం. అలాగే భారతీయ జనతాపార్టీతో కుమ్మక్కు అయ్యారని, ఎంపీ ఎన్నికల్లో అది బయటపడుతుందని, ఆ ప్రభావం ఎమ్మెల్యే ఎన్నికల మీద కనిపించకుండా ఉండడానికి ముందస్తు ఎన్నికలకు వస్తున్నారనే ప్రచారం ఎటూ ఉండనే ఉంది.

Image result for kcr

అయితే వీటన్నింటితో పాటూ కేసీఆర్ తన వ్యక్తిగత ప్రతిష్ట.. తన చరిష్మా నిరూపించుకోవడానికి కూడా ఇలా ‘అవసరం లేని’ ముందస్తు ఎన్నికలకు గంట మోగించారా? అనే అనుమానం కూడా ఆయన మాటలను బట్టి కలుగుతోంది. కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఎవ్వరికీ కలిసొచ్చిన దాఖలాలు లేవని చరిత్ర చెబుతోంది కదా.. అని విలేకర్లు ప్రశ్నించినప్పుడు ఆయన భిన్నంగా స్పందించారు.

Image result for kcr

‘‘కేసీఆర్ గెలుస్తాడు. చంద్రబాబు ఎన్టీఆర్ కన్నా మొగోణ్ని కావొద్దా’’ అంటూ కేసార్ నిలదీశారు. ‘‘చెన్నారెడ్డి వల్ల సాధ్యంకాని తెలంగాణ తెచ్చి చూపించి నిరూపించుకున్నా కదా’’ అని కూడా ముక్తాయించారు. చూడబోతే.. తన మగతనం చాటుకోవడానికే కేసీఆర్ ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: