అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణ రాష్ట్రంలో  ఎన్నికల ప్రకటన చేసి ఆ తర్వాత కొద్ది నిమిషాలకే  తన పార్టీ తరపున 105 మంది ఎన్నికల అభ్యర్థులను ప్రకటించే దేశంలోనే సంచలనం సృష్టించారు కెసిఆర్. తాజాగా కేసీఆర్ చేసిన ప్రకటన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

Image result for lokesh kcr

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముందస్తు ఎన్నికల గురించి చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్‌పై టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. తెలుగు వాళ్లంతా ఒక్కటంటూనే కేసీఆర్ మళ్లీ జాగో-బాగో అంటున్నారని ఎద్దేవా చేశారు.

Image result for lokesh kcr

ఆంధ్ర ఓట్లు లేకుండానే టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిందా అని నారా లోకేశ్ ప్రశ్నించారు. ఆంధ్రా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పక్కనే కూర్చొబెట్టుకుంటున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు.

Image result for lokesh kcr

ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల రాజకీయ నాయకులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకత మొదలవుతున్న నేపథ్యంలో...ఎక్కడ అధికారం పోతుందేమోనని భయపడి ముందస్తు ఎన్నికలు ప్రకటన చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలు రాబోయే ముందస్తు ఎన్నికల కోసం పొత్తులు హామీల విషయంలో తీవ్ర చర్చల్లో మునిగిపోయారు.




మరింత సమాచారం తెలుసుకోండి: