తెలంగాణ లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే తెరాస తన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టింది. అయితే పవన్ ఒక నిర్ణయం తీసుకుంటే బాబు పరువు పోతుందని కొంత మంది విశ్లేషిస్తున్నారు.  చంద్రబాబునాయుడు ఎటొచ్చీ.. పొత్తుల్లేకుండా తెలంగాణ ఎన్నికలను ఎదుర్కొనే ఉద్దేశంతో లేరు! ఇప్పటికే సీపీఐ, టీజేఎస్ లతో మంతనాలు పూర్తిచేసినట్లు కనిపిస్తోంది. సీపీఎం ఒక్కటీ.. వారికి నో చెబుతోంది. కాంగ్రెస్ తో కూడా జట్టుకట్టాలనే చంద్రబాబు తహతహ లాడుతున్నారు గానీ.. ఏపీలో పరువుపోతుందేమో అని భయపడుతున్నారు.

Image result for pavan janasena

ఇలాంటి పరిస్థితిలో పవన్ ఒక స్టెప్ తీసుకుంటే చంద్రబాబు పని కుడితిలో పడ్డ ఎలుకలా తయారవుతుందని పలువురు అంటున్నారు. లెఫ్ట్ పార్టీలు అంటే సీపీఐ కూడా విధిగా ఉండేట్లయితే సీపీఎం చెబుతున్న కూటమిలోకి జనసేన రావడానికి తనకు అభ్యంతరం లేదని పవన్ కల్యాణ్ తమ్మినేని వీరభద్రం ప్రతిపాదనకు ఓకె చెప్పాలి. అయితే ఆ కూటమిలో తెలుగుదేశం గానీ, కాంగ్రెస్ గానీ.. ఉండరాదని నిబంధన కూడా పెట్టాలి. అదే జరిగితే... చంద్రబాబుకు ఇబ్బందులు తప్పకపోవచ్చనేది పలువురి విశ్లేషణ.

Image result for chandrababu

ఎందుకంటే.. సదరు కూటమి పేరు మీద సీపీఐ, సీపీఎం బహుజన పార్టీలతో జనసేన కలిపి ఒక కూటమి ఏర్పడితే టీజెఎస్ కూడా సహజంగా ఆ కూటమిలో ఉండడానికే ఇష్టపడుతుంది. అందులోకి చంద్రబాబుకు ఎంట్రీ ఉండదు. అలాంటప్పుడు ఇక భాజపా, కాంగ్రెస్ తప్ప చంద్రబాబు జట్టుకట్టడానికి మరో ప్రత్యామ్నాయం ఉండదు. చంద్రబాబును దరికి రానివ్వకుంటే.. ఆయన విధిగా కాంగ్రెస్ తో మాత్రమే వెళ్లాలి. అదే జరిగితే.. ఏపీలో పరువు సాంతం పోతుంది. ఎంత గతిలేకపోయినా సరే.. కాంగ్రెస్ కాళ్లు పట్టుకుంటారా? అని యావత్ రాష్ట్రం చీదరించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: