కేసీఆర్ అసెంబ్లీని పక్కా ప్లాన్ ప్రకారం రద్దు చేశాడు. కేంద్రం లో బీజేపీ తో చేతులు కలిపిదన్నది వాస్తవం. రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరని ఊరకనే అన్లేదు మరి. 2009 ఎన్నికల సమయంలోనే బీజేపీ - టీఆర్‌ఎస్‌ మధ్య 'స్నేహం' చిగురించింది. అయితే ఆ స్నేహం ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే ప్రారంభమయి.. ఆ తర్వాత చల్లారిపోయింది. మళ్ళీ ఈ మధ్యకాలంలోనే ఆ స్నేహం గట్టిగా చిగురించింది. పార్లమెంటు వేదికగా కేసీఆర్‌ని నరేంద్రమోడీ అభినందించడం.. ఆ తర్వాత బీజేపీకి కేసీఆర్‌ మరింత దగ్గరవడం తెల్సిన విషయాలే. 

Image result for kcr

మజ్లిస్‌ పార్టీ 2014 ఎన్నికల నుంచీ టీఆర్‌ఎస్‌తో స్నేహంగానే వుంటూ వస్తోంది. 'నమ్మదగ్గ మిత్రపక్షం' అని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, పలు సందర్భాల్లో మజ్లిస్‌ గురించి చెప్పారు కూడా. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేశాక కూడా 'మజ్లిస్‌తో మా స్నేహం కొనసాగుతుంది' అంటూ క్లారిటీ ఇచ్చేశారు. మజ్లిస్‌ పార్టీకీ, భారతీయ జనతా పార్టీకీ అస్సలేమాత్రం పొసగదు. బీజేపీది హిందుత్వ నినాదం.. మజ్లిస్‌ది ఏ నినాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Image result for kcr

ఈ రెండూ ఉత్తర దక్షిణ ధృవాల్లాంటివే అయినా.. అవసరార్థం 'ఈక్వేషన్స్‌' మారిపోతుంటాయని.. ఈ రెండు పార్టీలూ ఇంకోసారి నిరూపించేయబోతున్నాయి.  నిజానికి మజ్లిస్‌ - బీజేపీ మధ్య ఓ అవగాహన తీసుకురావడంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కీలకపాత్ర పోషిస్తున్నారనుకోవచ్చు. 'మీరూ మీరు ఎలా పోట్లాడుకున్నా సరే.. నాతో మీ ఇద్దరూ స్నేహంగా వుండండి..' అనే రాజకీయ ఫార్ములాని కేసీఆర్‌ తెరపైకి తెచ్చి, దానికి ఇరు పార్టీలతోనూ సానుకూలంగా ఓటేయించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: