టాలీవుడ్ లో ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ ఒకంత బాధ, ఒకింత సంతోషంగా ఉన్నారు.  ఆగష్టు 29 న హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి నెల్లూరు ప్రయాణిస్తూ నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద హరికృష్ణ వాహనం ప్రమాదానికి గురైంది. వేగంగా ప్రయాణిస్తున్న వాహనం తిరగబడడంతో హరికృష్ణకు తీవ్రగాయాలతో దుర్మరణం చెందారు.  నేడు నందమూరి హరికృష్ణ పెద్దకర్మ.  హరికృష్ణ పెద్ద కర్మ కార్యక్రమానికి నందమూరి కుటుంబసభ్యులంతా హాజరయ్యారు.

Image result for balakrishna kalyan ram ntr launch

టిడిపి నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరై హరికృష్ణ చిత్ర పటానికి నివాళులు అర్పించారు.   అన్నయ్య నందమూరి హరికృష్ణ మరణం తర్వాత ఆయన తనయులు కళ్యాన్ రామ్, జూ.ఎన్టీఆర్ లకు పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు. అన్నయ్య కుటుంబానికి దగ్గరవుతూ వస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి భోజనం చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఎన్టీఆర్, బాలకృష్ణల నడుస్తోన్న కోల్డ్ వార్ ముగిసిందని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 

చంద్రబాబు ఆప్యాయంగా

నేడు పెద్ద కర్మ సందర్భంగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దగ్గరుండి జరిపించారు. తన సోదరుడి పెద్ద కర్మకు బాలకృష్ణ కూడా హాజరయ్యారు. హరికృష్ణ అంత్యక్రియల సందర్భంగా చంద్రబాబు, బాలయ్య కలసి హరికృష్ణ పాడె మోసిన సంగతి తెలిసిందే. నేడు హరికృష్ణ పెద్ద కర్మ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు   ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ని దగ్గరకు తీసుకుని చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడారు. తండ్రి మరణంతో విషాదంలో ఉన్న వారిద్దరికీ భరోసా ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: