బీజేపీతో  టీడీపీ విడిపోయి అపుడే నాలుగైదు నెలలు అవుతోంది. మరో వైపు చంద్రబాబు పాలనలో అడుగడుగునా అవినీతి చోటు చేసుకుందని బీజేపీతో సహా విపక్షాలు పెద్ద నోరే చేసుకుంటూ వచ్చాయి కానే, మరి ఆ వూసు  అపుడూ లేదు. ఎపుడూ లేదు ఉన్నట్లుండి బాబుపై సీబీఐ అన్న మాట ఈ రోజు ఇలా సడెన్ గా పుట్టుకొచ్చిందేటబ్బా.. ఇదే ఇపుడు సందేహం...ఇంటరెస్టింగ్ చర్చ కూడా


ఆయనకే ఎలా :


సినీ హీరో శివాజీ చాలా కాలం తరువాత మళ్ళీ ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. వస్తూనే ఓ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఒకటి వినిపించేశారు. విషయం పాతదే కానీ డెవలప్మెంట్ కొత్తది. దాంతో నాచురల్ గానే ఆసక్తి కలుగుతుంది. అదెంటంటే చంద్రబాబుకు  సీబీఐ అని పేరు పెట్టి చెప్పకపోయినా ఓ రాజ్యాంగ బధ్ధ సంస్థ సోమవారం నోటీసులు ఇస్తుందంట. తనకు నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి ఎవరో ఫోన్ చేసి కాంఫిడెన్షియల్ మాటర్ అంటూ చెప్పారట. ప్రాణహాని ఉన్నా జనాలను . అలెర్ట్ చేద్దామని మీడియాకు శివాజీ ఈ విషయాన్ని చెప్పారట.


బాబు కంటే ఎక్కువా :


ఎవరెన్ని విధాలుగా బాబు గురించి మాట్లాడుకున్నా ఆయనకు ఉన్న మేనేజ్మెంట్ స్కిల్స్ ని మాత్రం అంతా నొచ్చుకుంటూనే మెచ్చుకుంటారు. బాబు అమరావతిలో ఉన్నా డిల్లీలో ఏం జరుగుతుందో ఎప్పటికపుడు సమాచారం వస్తూనే ఉంటుంది. అన్ని వ్యవస్థలను బాబు బాగా మానేజ్ చేస్తారని విపక్ష  నేత జగన్ మొదలుకుని అంతా నిత్యం అంటూ ఉంటారు.  జనాలకు కూడా.   విషయంలో బాబుపై ఓ గట్టి నమ్మకం ఉంది . అలాంటిది బాబుకు ఇంతటి సీరియస్ మాటర్ తెలియకుండా ఉంటుందా అన్నదే  ఇపుడందరి డౌట్.  ఇక బాబు కంటే శివాజీకే నిఘా వ్యవస్థ ఎక్కువగా ఉందా అన్నది మరో డౌట్.


కాంగ్రెస్ తో పొత్తుల టైంలోనే:


సరిగ్గా అక్కడ బాబు కాంగ్రెస్ తో పొత్తులు కుదుర్చుకునే టైంలో ఇక్కడ  శివాజీ ఉన్నట్లుండి ఈ బాంబు పేల్చారు. ఆపరేషన్ గరుడా అంటూ మళ్ళీ మీడియా ముందుకొచ్చారు.  అంటే బీజేపీపై ద్వేషాన్ని మరో మారు ఇలా వెళ్ళగక్కడం ద్వారా ఆ పార్టీ కంటే కాంగ్రెస్ నయం అని చెప్పడమే దీని వెనక ఉద్దేశమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.  ఏపీలో చూడబోతే  టీడీపీ నేతలు కాంగ్రెస్ పొత్తుకు విముఖంగా ఉన్నారని తెలిసి ఇలా బీజేపీ తో ముప్పు ఉందని చెప్పి వారిని మానసికంగా పొత్తులకు   ఒప్పించడమా. ఇలా ఎన్నో సందేహాలు కూడా వస్తున్నాయి. 


బాబు నోటా అదే మాట :


ఇక అక్కడ హైదరాబాద్ లో ఎంటీయార్ భవన్లో బాబు మాట్లాడుతూ ఇదే మాటలను ఉటకించారు. తనపై సీబీఐ ప్రయోగిస్తున్నారని  క్యాడర్ కి చెప్పుకున్నారు. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీపై ఫైర్ అయ్యారు. చూస్తూంటే స్క్రిప్ట్ ఏదో టీడీపీ ఆఫీస్ నుంచే శివాజీకి అందినట్లుందేమో అనిపించకమానదు.  లేకపోతే ముంగిట్లో ఎన్నికలు ఉంచుకుని ఏ ప్రత్యర్ధి పార్టీ సీబీఐ ని ఉసిగొలపదు,

అందునా బాబు వంటి నాయకుని మీద సీబీఐ అటాక్ చేయించాలంటే ఒకటికి పది మార్లు ఆలోచించుకుంటారన్నది తెలిసిందే. నిజానికి ఆ ఉద్దేశం కేంద్రానికి ఉంటే ఎపుడో ఆ పని చేసేవారు, ఇన్నాళ్ళు ఆగుతారా.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా.. మొత్తానికి టీడీపీ ఎపుడు కావాలనుకుంటే అపుడు ఆపరేషన్ గరుడ ప్రచారంలోకి వస్తోంది. అదెంటో చిత్రం.



మరింత సమాచారం తెలుసుకోండి: