హరికృష్ణ పెద్ద కర్మ నాడు చంద్ర బాబు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ను కలిసి ధైర్యం చెప్పాడు అయితే నందమూరి హరికృష్ణ పెద్ద కర్మ కార్యక్రమానికి సంబందించి బయటకు వచ్చిన ఓ ఫొటో అందరినీ భలే ఆకర్షిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, తన మామయ్య చంద్రబాబు చెవిలో ఏదో చెబుతున్న ఫోటో అది. పక్కన వున్నది కళ్యాణ్. కాస్త అటు సెక్యూరిటీ జనాలు.ఈ ఫొటో ఫ్రేమ్ లోకి రాలేదు కానీ, కాస్త అటుగా బాలయ్య బాబు కూడా వున్నారు.

Image result for chandra babu

మరి ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ అంత రహస్యంగా చంద్రబాబు చెవిలో ఏం చెప్పినట్లు? ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతో సయోధ్య కోసం తహతహలాడుతున్నట్లు గుసగుసలు వినిపించడం ప్రారంభమైపోయింది. హరికృష్ణ మరణానికి ముందే సయోధ్య కోసం కళ్యాణ్ రామ్ తనవంతు ప్రయత్నం చేసారు. కానీ బాలయ్య వైపు నుంచి పాజిటివ్ సిగ్నళ్లు రాలేదు. దాంతో చంద్రబాబు మౌనంగా వుండిపోయారు.

Image result for jr ntr

ఇప్పుడు హరికృష్ణ మరణించారు. రాజకీయంగా పదవుల విషయమై చంద్రబాబుతో హరికృష్ణకు సమస్య వచ్చింది. ఎన్టీఆర్ కు ఆ సమస్యలేదు. పైగా ఎన్టీఆర్ ఇప్పుడు దాదాపు ఒంటరి. చంద్రబాబును ఢీకొనే శక్తి ఇప్పటికి అయితే ఎన్టీఆర్ కు లేదు. అది వాస్తవం. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలేదు. అది కూడా వాస్తవం. అందువల్ల ఇప్పటికిప్పుడు చంద్రబాబుకు దూరంగా వుండడం అనవసరం. అదే ఎన్టీఆర్ ఆలోచన కావచ్చు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ తన పంతాలు, ఇగోలు పక్కన పెట్టి బాబుగారికి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదంతా ఓకె. పక్కన అన్న, కాస్త అటుగా బాబాయ్ వుండగా పైకి చెప్పకుండా బాబుగారి చెవిలో చెప్పడం అంటే, ఏదో సమ్ థింగ్ అనుకోవాలేమో? అంత అన్నకు, బాబాయ్ కు తెలియకూడదనిది ఏమై వుంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: