తెలంగాణ లో టీడీపీ పరిస్థితి అందరికీ తెలిసిందే. అది ఎప్పుడో పాతాళంలోకి వెళ్లి పోయింది.  తెలంగాణ గడ్డపై టీడీపీ ఉండటం చారిత్రక అవసరమన్నారు. తెలంగాణలో టీడీపీ గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతానన్న చంద్రబాబు ఇప్పుడు అందుకు వ్యతిరేకంగా మాట్లాడారు.  'తెలంగాణలో ఆట ఎలా ఆడాలో నాకు తెలుసు' అని రేవంత్‌ రెడ్డి వెళ్లిపోయాక మొదటిసారిగా నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు చెప్పారు. నాయకులకు ధైర్యం నూరిపోశారు.

Image result for chandra babu

తెలంగాణలో పార్టీకి మళ్లీ జీవం పోయాలంటే తానే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా అప్పట్లో వ్యవహరించారు. గతంలో ఏ ప్రధాని చేయనంత ఎక్కువగా ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం చేశారు. ఉప ఎన్నికలను కూడా వదిలిపెట్టలేదు. మోదీ అంతటివాడే విపరీతంగా ఎన్నికల ప్రచారం చేసినప్పుడు చంద్రబాబు తాను తెలంగాణలో ప్రచారం చేయనని ఎందుకన్నారు? దీని వెనక ఉన్న వ్యూహమేమిటి?

Image result for chandra babu

'మీరు ఎన్నికల్లో పోరాడండి..మీకు అండగా ఉంటా' అన్నారు. గతంలో పొత్తులపై రాష్ట్ర టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లుగా ప్రకటనలు చేయవద్దని, ఎన్నికల సమయంలోనే వాటి గురించి చర్చిద్దామని అన్న చంద్రబాబు హైదరాబాదుకు వచ్చి కూడా కాంగ్రెసుతో పొత్తులపై తేల్చలేదు. టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను పల్లెత్తు మాట అనకుండా బీజేపీని, నరేంద్ర మోదీని దుయ్యబట్టారు. తాను తెలంగాణలో ప్రచారం చేస్తే కేసీఆర్‌ ఎదురుదాడి చేస్తారని బాబు భయపడుతున్నారా?


మరింత సమాచారం తెలుసుకోండి: