నవంబర్ లో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల కలిస్తే కెసిఆర్ అడ్రస్ గల్లంతవుతుందని టిఆర్ఎస్ పార్టీ దారుణంగా ఓడిపోతుందని సంచలన కామెంట్ చేశారు వి.హెచ్. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని...ముఖ్యంగా హైదరాబాదు నగరంలో ఉన్న సెటిలర్లకు టిఆర్ఎస్ పార్టీ పట్ల నమ్మకం లేదని..అబద్రతా భావంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.

Related image

ఇదే క్రమంలో ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్లకు కేసీఆర్ బెదిరిపోయారని అన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ వెంటనే స్పందించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తో మళ్లీ సీఎం కేసీఆరే అని చెప్పించారని ఎద్దేవా చేశారు.

Image result for kcr

కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసిన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఆపలేడని వి.హనుమంతరావు హెచ్చరించారు. ఇలా ఉండగా భారత్ బంద్ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని...కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకు ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని కోరారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నిరసనలు తెలపాలని కోరారు.

Image result for kcr vh

బంద్ సందర్భంగా బస్సులు తిరగావని రోడ్డు ఎక్కవని, బస్సులు తిప్పితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని వి.హెచ్ హెచ్చరించారు. వ్యాపారులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు బంద్ కు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు కేసీఆర్ ప్రభుత్వం బందు కి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: