కాంగ్రెస్ ని కౌగలించుకోవాలని ఉంది. అయితే బాహాటంగా ఆ పని చేస్తే ఏమవుతుందోనని జంకు. రేపటి ఏపీ ఎన్నికలలో నిండా మునిగిపోతామేమోనని భయం. కానీ ఆ పార్టీతోనే రాజకీయం, ఫ్యూచర్ పాలిటిక్స్ అని డిసైడ్ చేసుకున్నాక కూడా ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు. మొత్తానికి చంద్రబాబు కాంగ్రెస్ ని వదలకుండానే కొత్త ఎత్తులు వెస్తున్నారు. 


కూటమి పేరిట :


తెలంగాణాలో డైరెక్ట్ గా కాంగ్రెస్ తో అంటకాగితే ఆ మచ్చ ఏపీలో విపక్షాలకు ఆయుధంగా మారుతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అందుకే కూటమి అంటూ కొత్తగా ...కవరింగు  చేసుకుంటున్నారు. మహా కూటమి పేరుతో జట్టు కడితే అందరితోనూ తామూ ఉన్నామని చెప్పుకోవచ్చునని అనుకుంటున్నారు.  పక్కన వామపక్షాలు కూడా ఉంటాయి కాబట్టి బేఫికర్ గా కాంగ్రెస్ తో అంటకాగినా అర్ధాలు మార్చి చెప్పుకోవచ్చునని ప్లాన్ వేస్తున్నారు.


ఇక్కడా లాభమే :


తెలంగాణాలో ఒక కొత్త కూటమి ఏర్పాటు చేసి కేసీయర్ కి వ్యతిరేకంగా ఎన్నికలకు వెళ్ళాలని టీడీపీ డిసైడ్ అయింది. ఈ కూటమి ద్వారా చంద్రబాబు మళ్ళీ పదేళ్ళ తరువాత వామ పక్షాలతో చెలిమికి కూడా బాటలు వేశారు. ఇలా చేయడం వల్ల ఏపీలోనూ కలసి వస్తుందని బాబు భావిస్తున్నారు. ఇక్కడ కూడా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, వామపక్షాలతో కూటమి కట్టి ముందుకు పోవాలని బాబు తపన పడుతున్నట్లుగా అర్ధమవుతోంది. ఏపీలో బాబుకు వ్యతిరేకంగా కామ్రెడ్స్ స్టాండ్ తీసుకున్నాయి.
తెలంగాణా నుంచి నరుక్కురావడం ద్వారా ఏపీలోనూ కామ్రెడ్స్ ఒప్పించగలమని బాబు ధీమాగా ఉన్నారు. మొత్తానికి తాను అనుకుంటున్నట్లుగా కాంగ్రెస్ తో అంట కాగుతూనే కూటమి నాటకాలకు టీడీపీ దిగిపోయింది. ఇది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: