జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తో దిగ్విజయంగా దూసుకుపోతున్నాడు. ఇసుకేస్తే రాలనంత జనం తో జగన్ పాదయాత్ర నడుస్తుంది.  ఉత్తరాంధ్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న అభిమానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది కంచరపాలెం బహిరంగ సభ. ఎక్కడ చూసినా జనం. ఎటు చూసినా ప్రజలు. కొన్నిగంటల పాటు కంచరపాలెం, మధురవాడ మధ్య అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. జగన్ సభ కోసం చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు వెల్లువలా వచ్చారు. కంచరపాలెంలో మరో సముద్రాన్ని తలపించారు. 

Image result for jagan kancharapalem

కంచరపాలెం బహిరంగ సభకు వచ్చిన జన సమూహాన్ని చూసి ఒకదశలో జగన్ సైతం ఆశ్చర్యపోయారు. ఎండ, వాన లెక్కచేయకుండా తనపై, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో వచ్చిన లక్షలాది మంది ప్రజలకు శిరస్సు వచ్చి కృతజ్ఞతలు తెలిపారు జగన్. అశేష జనవాహిని సాక్షిగా మరోసారి చంద్రబాబు అవినీతి పాలనను, టీడీపీ సర్కార్ సాగించిన అరాచక బాగోతాన్ని ప్రజలముందుంచారు జననేత. మరీ ముఖ్యంగా విశాఖకు బాబు చేసిన అన్యాయాన్ని విడమర్చి చెప్పారు. 

Image result for jagan kancharapalem

"ఎన్నికలకు ముందు విశాఖకు సంబంధించి చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదు. మరీ ముఖ్యంగా గత ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక రైల్వేజోను అంటూ ఊదరగొట్టారు. నాలుగున్నర సంవత్సరాలు కేంద్రంలో బీజేపీతో సంసారం చేశారు. అప్పుడు రైల్వేజోను గుర్తుకురాలేదు. ప్రత్యేకహోదా కూడా గుర్తుకాలేదు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడే గట్టిగా పట్టుబట్టి ఉంటే ఈపాటికి జోన్ వచ్చేది." ఇలా చంద్రబాబు అరాచక పాలనను, అతడి లాలూచీ రాజకీయాల్ని ప్రజల కళ్లకు కట్టినట్టు వివరించారు జగన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: