2014 లోక్ సభ ఎన్నికలలో మోడీ ప్రధాని అవడానికి చాలా కృషి చేశారు రాజకీయాల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆ సమయం లో జరిగిన ఎన్నికలలో మోడీ ప్రధాని అవడానికి గల కారణాలలో ముఖ్య కారణం డిజిటల్ మీడియా. ఆ సమయంలో డిజిటల్ మీడియా ని ఉపయోగించి మోడీని ఆయన హామీలను దేశంలో సామాన్య ప్రజల గుండెల్లోకి అద్భుతంగా తీసుకెళ్లారు ప్రశాంత్ కిషోర్.

Image result for prashant kishor

ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి)లో జరిగిన లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న పీకే పలు సంచలన విషయాలు తెలియజేశారు. ప్రస్తుతం తన ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీలో ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.

Image result for prashant kishor

ఇదే క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి తాను పెద్దమొత్తంలో డబ్బు తీసుకుని, ఎన్నికల్లో వైసీపీ విజయానికి సహకరిస్తున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించారు. ఇవన్నీ పుకార్లేనని, వీటిల్లో నిజంలేదన్నారు. తనకు జగన్ 300నుంచి 400కోట్లు ఇచ్చారన్న వార్తలన్నీ కేవలం పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు.

Related image

కేవలం జగన్ ఎన్నికల వ్యూహ కర్తగా తనను  నియమించుకున్నరాని అన్నారు. వైసీపీ పార్టీ కి పెద్ద ఎడ్వాంటేజ్ ఏమిటంటే ఆ పార్టీ అధ్యక్షుడే వైసిపి పార్టీ కి పెద్ద బలం అని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా వైసిపి చరిత్ర సృష్టిస్తుందని పేర్కొన్నారు. జగన్ పాదయాత్ర చివరాఖరికి వచ్చే సరికి ఏపీ స్టేట్ లో పాలిటిక్స్ మొత్తం జగన్ వైపు మళ్ళుతాయి అని పేర్కొన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: