విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి తన ట్రెండ్ ని కొనసాగించలేరా అంటే అవుననే ఆన్సర్ వస్తోంది. ఎప్పటికపుడు కొత్త కండువాల కోసం వెంపర్లాడే మంత్రి గారికి ఇపుడు వేరే జెండా ఏదీ కనిపించని స్తితి. ఉన్న పార్టీలో పొగ పెడుతున్నారు. బయట మాత్రం నో ఎంట్రీ బోర్డ్ దర్శనమిస్తోంది.


చెడుగుడు ఆడేసిన జగన్ :


విశాఖలో లక్షలాది మందితో జరిగిన  జన సభలో వైసీపీ అధినేత జగన్ మంత్రి గంటాపై ఓ రేంజిలో  విరుచుకుపడ్డారు. ప్రభుత్వ భూములు తకట్టు పెట్టి బ్యాంకులలో రుణాలు తెచ్చుకున్నారంటూ మండిపడ్డారు. విశాఖలో అభివ్రుధ్ధి లేదు కానీ మంత్రి బాగానే ఉన్నారంటూ సెటైర్లు వేశారు. విద్యా శాఖలోనూ అవినీతి తాండవిస్తోందంటూ అటాక్ చేశారు. మొత్తానికి  జగన్ తన  స్పీచ్ తో  గంటాకు చుక్కలు చూపించారు.


ఆయనా ఇంతే :


రెండు నెలల క్రితం విశాఖలో కలియతిరిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా గంటాపైనే హాట్ కామెంట్స్ చేశారు. భూ దందాలో మంత్రులు ఉన్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ గ్రంధాలయాన్ని కూడా వదలలేదంటూ గంటానే టార్గెట్ చేశారు. ఇలా ఇద్దరు ప్రతి పక్ష నాయకులూ మంత్రినే గురి పెట్టి బాణాలు వేయడం విశేషం.


నో ఎంట్రీ :


దీంతో గంటా ఫ్యూచర్ పాలిట్రిక్స్ కి బ్రేక్ పడిందని అంటున్నారు. ప్రతి ఎన్నికకూ ఓ కొత్త పార్టీ, కొత్త నియోజకవర్గం అంటూ తనదైన ట్రెండ్ క్రియేట్ చేసుకున్న గంటాకు ఈసారి కలసి రావడంలేదని అంటున్నారు. ఆయనకు టీడీపీ తప్ప మరే దారీ లేదని కూడా తేల్చేస్తున్నారు. పోనీ ఇక్కడేమైనా సరిగా ఉందా అంటే భీమిలీ సీటు డౌట్లో పెట్టారు. మొత్తానికి గంటా ఎన్నడూ లేని విధంగా ఇపుడు ఇరకాటంలో పడ్డారని సెటైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: