రాజకీయాలలో వారసత్వాలు ఇపుడు సర్వ సాధారణమైపోయాయి. తమ తరువాత సీటును ఖాళీ చేసి కొడుకు, కూతురుకు ఇవ్వాలని తండ్రులు చేస్తున్న డిమాండ్లు ఓ దశలో అధినేతలకు తల నొప్పులు తెస్తున్నాయి. కానీ సీనియర్ల మాట కాదనలేని పరిస్తితి. ఇపుడు టీడీపీలో కూడా ఓ సీనియర్ పొలిటీషియన్ తన వారసురాలి కోసం గట్టిగానే లాబీయింగ్ చేసి సక్సెస్ అయ్యారని తెలుస్తోంది.


అక్కడ నుంచి పోటీ :


భీమీలీ నుంచి వచ్చే ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతిరాజు పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. అదే జరిగితే ఆమె తన పెదనాన్న ఆనందగజపతి రాజు వారసురాలుగా కూడా అవుతారు 1983లో ఇక్కడ నుంచి ఆనంద్ పోటీ చేసి బంపర్ మెజారిటీతో గెలిచారు. అన్న నందమూరి కొలువులో విద్యా మంత్రి గా కూడా పనిచేసారు.


బాబు గ్రీన్ సిగ్నల్ :


వచ్చే ఎన్నికలలో తాను రిటైర్ కావాలని అశోక్ భావిస్తున్నారు. . తన కూతురును విజయనగరం అసెంబ్లీ నుంచి పోటీకి దించుదామని అనుకున్నారు. అయితే కులాల సమీకరణలు సరిపోక అక్కడ ఆమెకు సీటు డౌట్లో పడింది. దాంతో తమ కుటుంబానికి ఒకపుడు వెన్ను దన్నుగా నిలిచిన భీమిలీ సీటుపై అశోక్ ఫ్యామిలీ మనసు పారెసుకుందంటున్నారు. దీనికి బాబు కూడా సరేనని అనడంతో రాజకీయం మారనుంది.


మంత్రికి చెక్ :


ఇక్కడ నుంచి అదితి గజపతి రాజు పోటీ చేస్తే మంత్రిగా ఉన్న గంటాకు చెక్ పెట్టినట్లేనని అంటున్నారు. ఆయనను విశాఖ, లేదా అనకాపల్లి నుంచి ఎంపీగా బరిలోకి దింపుతారని టాక్ నడుస్తోంది. గంటా మాత్రం ఎమ్మెల్యేగానే ఉంటానని చెబుతున్నారు.  భీమిలీ ఫైట్ ఇపుడు అశోక్ వర్సెస్ గంటాగా మారిపోతోంది. చూడాలి ఇపుడు ఎవరు నెగ్గుతారో.


మరింత సమాచారం తెలుసుకోండి: