ఏపీలో అంతా బాగుందని సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుంటూ భ్రమల్లో బతికేస్తున్న తమ్ముళ్ళకు షాక్ ఇచ్చే రిపోర్ట్ ఒకటి వచ్చిందట. అధికార పార్టీకి అంత అనుకూలత లేదన్నదే ఆ రిపోర్ట్.  గ్రౌండ్ లెవెల్లో అంతా తేడాగా ఉందని కూడా చెబుతోంది నివేదిక.  దాంతో తమ్ముళ్ళు గంగవెర్రెక్కిపోతున్నారు., పరేషాన్ అవుతున్నారు.


జన సునామీ :


విశాఖలో జగన్ సభకు జన సునామీ పోటెత్తింది. ఇప్పటికి ఎన్నో మార్లు చంద్రబాబు విశాఖలో మీటింగులు పెట్టినా రాని జనం ఒక్క సారిగా జగన్ వైపు ఎలా మళ్ళారన్నది టీడీపీ హై కమాండ్ ని ఒకటే దొలిచేస్తోంది. జగన్ ని చాల తేలికగా తీసుకున్న పార్టీ పెద్దలు ఇపుడు జనంలో మార్పు కనిపిస్తోందని అంగీకరిస్తున్నారు. అది క్రిష్ణా తీరమైనా, గోదావరి వంతెనైనా, ఏటికొప్పాక వంతెనైనా, నర్శీపట్నం మీటింగ్ అయినా, విశాఖ సభా అయినా ఒకేలా జన స్పందన ఉందని ఇంటలిజెంట్ రిపోర్ట్  గా ఉంది.


చేంజ్ మూడ్ :


జనంలో చేంజ్ మూడ్ వచ్చేసిందన్న దానికి సంకేతమే ఈ జనం అన్నది ఇంటెలిజెంట్ నివేదికలు చెబుతున్నాయి. డబ్బులిచ్చి జనాలను తెచ్చారని ఓ వైపు తమ్ముళ్ళు అంటున్నా అలా అయితే అవే డబ్బులు అంత కంటే ఎక్కువ అధికార పార్టీ వద్ద కూడా ఉన్నాయి, పైగా అధికారం కూడా చేతిలో ఉంది. అయినా జన స్పందన అంతగా ఉండడంలేదని అంటున్నారు. పైగా వచ్చిన జనం, తెచ్చిన జనం మధ్య తేడా చాల క్లియర్ గా ఉంటుందని అంటున్నారు. 


జగన్ మీటింగులకు వచ్చే జనం ఎండలను, వానలను కూడా తట్టుకుంటూ వేచి ఉంటున్నారని చెబుతున్నారు.  మరో వైపు వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఏపీలో జగన్ ప్రభంజనం ఖాయమని ఇచ్చిన రిపోర్ట్ అంటూ ఒకటి ప్రచారంలోకి రావడంతో వైసీపీ ఫుల్ ఖుషీలో ఉంది. లేటెస్ట్ పరిణామాలు టీడీపీ లో హై బీపీని పెంచుతున్నాయి. మరో రెండు జిల్లాల పాదయాత్ర మాత్రమే మిగిలి ఉన్న టైంలో జగన్ ప్రతి అడుగూ ఇపుడు అధికార పార్టీ నిఘాతో సాగనుందని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: